ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను కళ్ళు మూసుకుని నమ్మేయచ్చు.. మనస్సు వెన్న, ఎలాంటి అపాయం చేయరు!-numerology says one can trust blindly if people who born on these dates ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను కళ్ళు మూసుకుని నమ్మేయచ్చు.. మనస్సు వెన్న, ఎలాంటి అపాయం చేయరు!

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను కళ్ళు మూసుకుని నమ్మేయచ్చు.. మనస్సు వెన్న, ఎలాంటి అపాయం చేయరు!

Peddinti Sravya HT Telugu

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పొచ్చు. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ నెంబర్స్ ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా మనిషి ఆలోచన విధానం, అలవాట్లు, ప్రత్యేకత ఇలాంటివి ఎన్నో విషయాలు చెప్పొచ్చు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను గుడ్డిగా నమ్మొచ్చు. పూర్తి విశ్వాసంతో ఉంటారు.

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను కళ్ళు మూసుకుని నమ్మేయచ్చు (pinterest)

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పొచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందనేది చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది కూడా చెప్పొచ్చు. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ నెంబర్స్ ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా మనిషి ఆలోచన విధానం, అలవాట్లు, ప్రత్యేకత ఇలాంటివి ఎన్నో విషయాలు చెప్పొచ్చు.

తేదీల్లో పుట్టిన అమ్మాయిలను గుడ్డిగా నమ్మొచ్చు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఏమైనా షేర్ చేసుకున్నా ఇతరులకు చెప్పరు. దీంతో పొరపాటున ఏ విషయాలైనా చెప్పినా భయపడక్కర్లేదు. మరి ఏ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను నమ్మొచ్చు? ఎవరి వలన నష్టం ఉండదు?

రాడిక్స్ నెంబర్ 2

రాడిక్స్ నెంబర్ 2 వారు చాలా నిజాయితీగా ఉంటారు. ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ రెండు అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి చంద్రుడు. చంద్రుడు మెదడు, ఆలోచనలు, భావాలు, మానసిక స్థితి వంటి వాటికి కారకుడు. చంద్రుడు మానసిక ప్రశాంతతని పెంపొందించి ప్రశాంతంగా ఉంచుతాడు.

నమ్మినా నష్టం ఉండదు

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను గుడ్డిగా నమ్మేయచ్చు. రిలేషన్‌షిప్‌లో నిజాయితీగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నమ్మకాన్ని ఏ మాత్రం బ్రేక్ చేయరు. వారు ఎప్పుడూ కూడా స్వచ్ఛమైన హృదయంతో ఇతరులను ప్రేమిస్తారు.

ప్రశాంతంగా, నెమ్మదిగా ఉంటారు

న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడూ నెమ్మదిగా ఉంటారు. జీవితంలో ప్రశాంతత ఉండేటట్టు చూసుకుంటారు. బ్యాలెన్స్ జీవితం ఉండాలని అనుకుంటారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే భయపడరు, తొందరపడరు. పరిస్థితిని జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటారు. వారికి తగ్గట్టుగా పరిస్థితిని మార్చుకుంటారు.

క్రియేటివిటీ ఎక్కువ

రాడిక్స్ నెంబర్ రెండు వారికి క్రియేటివిటీ కూడా ఎక్కువ. ఎప్పుడూ కూడా ప్రేమించిన వ్యక్తిని సంతోషంగా చూసుకుంటారు. పైగా వీరి మనసు కూడా వెన్నలా ఉంటుంది. స్వచ్ఛమైన హృదయంతో ఇతరుల మనసుని దోచుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను నమ్మిన ఏమాత్రం నష్టం ఉండదు. ఎప్పుడూ కూడా వదిలి వెళ్ళిపోయే రకం కాదు. స్వచ్ఛమైన హృదయంతో ప్రేమిస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.