న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి, వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందనేది చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో మొత్తం రాడిక్స్ నంబర్స్ 1 నుంచి 9 వరకు ఉంటాయి.
పుట్టిన సంఖ్యల ఆధారంగా రాడిక్స్ నంబర్స్ తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు కూతుళ్లుగా, మంచి కోడళ్ళుగా, భార్యగా పేరు తెచ్చుకుంటారు. మరి వీరిలో మీరు ఒకరా వచ్చేమో తెలుసుకోండి.
న్యూమరాలజీ మొత్తం ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ నంబర్స్ ఉంటాయి. ఒక్కో రాడిక్స్ నంబర్ వారి ప్రవర్తన తీరు ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు పుట్టింట్లో, అత్తింట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. మంచి కూతురుగా, మంచి కోడలుగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రేమ, గౌరవాన్ని పొందుతారు.
న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ నెంబర్ 8 వారు మంచి కోడళ్ళు. కుటుంబం నుంచి ఎక్కువ ప్రేమను, గౌరవాన్ని పొందుతారు. రాడిక్స్ నెంబర్ 8కి అధిపతి శని. ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 8 అవుతుంది.
శని ప్రభావం కారణంగా ఈ తేదీల్లో పుట్టిన వారు బాధ్యతగా ఉంటారు. వారికి అప్పగించిన బాధ్యతలను కచ్చితంగా పూర్తి చేస్తారు. అదే విధంగా ఈ తేదీల్లో పుట్టిన వారికి భక్తి కూడా ఎక్కువ. అత్తింట్లో, పుట్టింట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. రాడిక్స్ నెంబర్ 8 వారు అత్తమామలను సంతోషంగా ఉండేలా చూసుకుంటారు. వారి ప్రవర్తన, పనితో అందరినీ ఆకట్టుకుంటారు.
మంచి భార్యలుగా కూడా పేరు తెచ్చుకుంటారు. తమ భర్తతో ఎంతో నిజాయితీగా ఉంటారు. ఎల్లప్పుడూ భర్తకు సపోర్ట్‌గా ఉంటారు. భర్త నుంచి ప్రేమ, గౌరవాన్ని పొందుతారు. నిజం ఎక్కడ ఉంటే ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కూడా అక్కడే ఉంటారు. పుట్టింట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. తల్లిదండ్రులకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటారు. వీరి వల్ల ఎవరూ బాధ పడరు. వీరిని చూసి గర్వంగా ఫీల్ అవుతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్