Numerology reveals: ఈ తేదీన పుట్టిన అమ్మాయి ఇంటికి గృహలక్ష్మి.. వారి తండ్రులు వెరీ లక్కీ!-numerology reveals about fathers life these daughters give lots of luck and happiness ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Numerology Reveals: ఈ తేదీన పుట్టిన అమ్మాయి ఇంటికి గృహలక్ష్మి.. వారి తండ్రులు వెరీ లక్కీ!

Numerology reveals: ఈ తేదీన పుట్టిన అమ్మాయి ఇంటికి గృహలక్ష్మి.. వారి తండ్రులు వెరీ లక్కీ!

Peddinti Sravya HT Telugu

Numerology reveals: న్యూమరాలజీ ప్రకారం ఒక ఆడపిల్ల పుట్టిన తేదీని బట్టి వారి తండ్రి జీవితం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. మీ అమ్మాయి పుట్టిన తేదీ ఆధారంగా మీ జీవితం ఎలా ఉంటుంది? ఈ తేదీల్లో పుట్టిన అమ్మయిల తండ్రులు మాత్రం చాలా లక్కీ.

Numerology reveals: ఈ తేదీన పుట్టిన అమ్మాయి ఇంటికి గృహలక్ష్మి (pinterest)

న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది అనేది చెప్పొచ్చు. అలాగే భవిష్యత్తు గురించి కూడా న్యూమరాలజీ చెప్తుంది. ఈరోజు న్యూమరాలజీ ప్రకారం కొన్ని విషయాలను తెలుసుకుందాం. న్యూమరాలజీ ప్రకారం ఒక ఆడపిల్ల పుట్టిన తేదీని బట్టి వారి తండ్రి జీవితం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం.

మీ అమ్మాయి పుట్టిన తేదీ ఆధారంగా మీ జీవితం ఎలా ఉంటుంది?

చంద్రుడు పరిపాలించే (2,11, 20, 29) భావోద్వేగ స్థిరత్వం

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు తండ్రి జీవితంలో భావోద్వేగ స్థిరత్వాన్ని తీసుకు వస్తారు. ఆమె సంతోషంగా ప్రశాంతంగా ఉంటే తండ్రి మానసిక స్పష్టత, అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. అదే ఒకవేళ ఆమె మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లయితే తండ్రి ఒత్తిడితో బాధపడుతూ ఉంటారు.

శుక్రుడు పరిపాలించే (6,15, 24) గృహలక్ష్మి

పైన చెప్పిన తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఇంటికి గృహలక్ష్మిలు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు తండ్రికి అదృష్టాన్ని, ధనాన్ని అందిస్తారు. ఈ అమ్మాయిలని ప్రేమగా, గౌరవంగా చూసుకున్నట్లయితే తండ్రి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.

తండ్రి సంతోషంగా జీవిస్తాడు. అదే ఒకవేళ వీళ్ళని సరిగ్గా చూసుకోకపోతే శుక్రుని ఆశీర్వాదాలు తగ్గుతాయి. దీంతో తండ్రులకు ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక నష్టం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ గృహలక్ష్మిలు ఇంటికి శ్రేయస్సును తీసుకువస్తారు.

సూర్యుడు పరిపాలించే (1,10,19, 28) సక్సెస్

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు తండ్రులు గౌరవం, కెరియర్ లో విజయాన్ని అందుకుంటారు. ఒకవేళ వీరి శ్రేయస్సుని నిర్లక్ష్యం చేస్తే తండ్రులు వృత్తిపరమైన సమస్యల్ని, అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

బుధుడు పరిపాలించే (5,14, 23) తెలివైన నిర్ణయాలు

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు తండ్రి జీవితంలో సమస్యల్ని పరిష్కరించే సౌరభాన్ని తీసుకొస్తారు. తెలివైన, ఆర్థిక, వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో మార్గదర్శకత్వం, సహాయం అందిస్తారు. వీరిని స్వేచ్ఛగా ప్రోత్సాహంతో పెంచితే తండ్రులకు అవకాశాలు వెతుక్కుని వస్తాయి అదే వీరిని సరిగా చూసుకోకపోతే ఆర్థిక తప్పిదాలు, చట్టపరమైన సమస్యలు, అపార్ధాలు వంటివి కలుగుతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail

సంబంధిత కథనం