Numerology Prediction: ఈ వారం ఈ 3 సంఖ్యల వారికి అదృష్టం.. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో భారీ లాభం!-numerology prediction people who born on these dates will bring new job promotions and many more ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Numerology Prediction: ఈ వారం ఈ 3 సంఖ్యల వారికి అదృష్టం.. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో భారీ లాభం!

Numerology Prediction: ఈ వారం ఈ 3 సంఖ్యల వారికి అదృష్టం.. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో భారీ లాభం!

Peddinti Sravya HT Telugu

Numerology Prediction: న్యూమరాలజీ ఆధారంగా ఎటువంటి సమస్యలు వస్తాయి?, ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ నెల 14 నుంచి 20వ తేదీల వరకు ఈ వారంలో ఈ సంఖ్యలు వారికి కలిసి వస్తుంది.

న్యూమరాలజీ (pixabay)

న్యూమరాలజీ ఆధారంగా భవిష్యత్తులో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఎటువంటి సమస్యలు వస్తాయి?, ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ నెల 14 నుంచి 20వ తేదీల వరకు ఈ వారంలో ఈ సంఖ్యలు వారికి కలిసి వస్తుంది.

ఈ వారం ఈ మూడు రాడిక్స్ నెంబర్ల వారికి ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా వ్యాపారంలో లాభాలతో పాటు ఎన్నో చోటు చేసుకుంటాయి. ఈ వారం ఈ మూడు సంఖ్యల వారికి కలిసి వస్తుంది కూడా. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం, తీరు కూడా చెప్పవచ్చు. భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా చెప్పవచ్చు.

రాడిక్స్ నెంబర్ 3

రాడిక్స్ నెంబర్ 3 వారికి బాగుంటుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఈ వారం టెన్షన్స్ వంటివి తొలగిపోతాయి. వ్యాపారులకి కూడా ఈ వారం కలిసి వస్తుంది. కొత్త ఆర్డర్లు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ఈ వారం మీకు కలిసి వస్తుంది. ఉద్యోగం మారే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ రావచ్చు. గురువారంలోగా శుభవార్తలు వింటారు.

రాడిక్స్ నెంబర్ 3 వారు ఏం చేయాలి?

  • గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది
  • విష్ణుమూర్తిని ఆరాధించడం
  • అరటి చెట్టుకు నీళ్లు అందించాలి

రాడిక్స్ నెంబర్ 4

రాడిక్స్ నెంబర్ 4 వారికి ఈ వారం బాగుంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు కలిసి వస్తుంది. రాడిక్స్ నెంబర్ 4 వారికి ఈ వారం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ప్రభుత్వ పేపర్ వర్క్ లేదా ఇతర దేశాలతో లింక్ అయిన వ్యాపారులకు బాగుంటుంది. కెరీయర్ మలుపు తిరుగుతుంది.

రాడిక్స్ నెంబర్ 4 వారు ఏం చేయాలి?

  • బుధవారం ఆకుపచ్చ వస్తువులు దానం చేయడం మంచిది
  • తులసి మొక్క దగ్గర దీపారాధన చేయండి
  • గణేశుడు మంత్రంతో రోజు మొదలు పెట్టడం వలన అదృష్టం కలిసి వస్తుంది

రాడిక్స్ నెంబర్ 8

ఈ వారం మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రమోషన్లు కూడా వస్తాయి. ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త మార్గాల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు.

రాడిక్స్ నెంబర్ 8 వారు ఏం చేయాలి?

  • మంగళవారం కలిసి వస్తుంది
  • నీలం రంగు దుస్తులు ధరించడం మంచిది
  • ఆవాల నూనెతో శని దేవుడికి దీపారాధన చేయడం మంచిది
  • నల్లటి దుప్పట్లను దానం చేయడం మంచిది

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail

సంబంధిత కథనం