నవంబర్ నెలలో ఐదు సార్లు శుక్రుడి సంచార మార్పులు, ఈ రాశులకు ప్రమోషన్లు, వాహనాలు, కొత్త వాహనాలు, ఉద్యోగాలతో పాటు ఎన్నో!-november month venus transit 5 times these zodiac signs will receive promotions vehicles jobs and many more ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నవంబర్ నెలలో ఐదు సార్లు శుక్రుడి సంచార మార్పులు, ఈ రాశులకు ప్రమోషన్లు, వాహనాలు, కొత్త వాహనాలు, ఉద్యోగాలతో పాటు ఎన్నో!

నవంబర్ నెలలో ఐదు సార్లు శుక్రుడి సంచార మార్పులు, ఈ రాశులకు ప్రమోషన్లు, వాహనాలు, కొత్త వాహనాలు, ఉద్యోగాలతో పాటు ఎన్నో!

Peddinti Sravya HT Telugu

జ్యోతిష్యం ప్రకారం చూసినట్లయితే ప్రతి గ్రహం కూడా జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతూ ఉంటుంది. శుక్రుడు ధనం, సంపద, విలాసాలకు కారకుడు. త్వరలో శుక్రుడు సంచారం జరగబోతోంది. శుక్రుడి రాశి మార్పు అనేక రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందుతారు.

నవంబర్‌లో శుక్రుడి సంచారంలో మార్పు

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం చూసినట్లయితే ప్రతి గ్రహం కూడా జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతూ ఉంటుంది. శుక్రుడు ధనం, సంపద, విలాసాలకు కారకుడు. త్వరలో శుక్రుడు సంచారం జరగబోతోంది. శుక్రుడి రాశి మార్పు అనేక రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందుతారు.

నవంబర్‌లో శుక్రుడి సంచారంలో మార్పు

నవంబర్ నెల చాలా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. నవంబర్ నెలలో శుక్రుడు ఐదు సార్లు తన స్థానాన్ని మారుస్తాడు. నవంబర్ 2న సొంత రాశి అయిన తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. నవంబర్ 7న స్వాతి నక్షత్రంలోకి అడుగు పెడతాడు. నవంబర్ 13న విశాఖ నక్షత్రంలోకి వెళ్తాడు.

అదే విధంగా నవంబర్ 26న వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. నవంబర్ 29న అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇలా శుక్రుడి నక్షత్ర సంచారం, రాశి మార్పు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతున్నాయి. మరి ఏ రాశుల వారు అదృష్టాన్ని పొందుతారు? ఎవరికి ఎన్ని విధాలుగా కలిసి వస్తుంది? ఈ రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

నవంబర్ నెలలో ఐదు సార్లు శుక్రుడి సంచార మార్పులు.. ఈ రాశుల వారికి బోలెడు లాభాలు:

1.వృషభ రాశి:

వృషభ రాశి వారికి శుక్రుడి సంచారం శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ రాశి వారికి నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు.

2.సింహ రాశి:

సింహ రాశి వారికి నవంబర్ నెల బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కూడా ఉంటుంది. విదేశాల్లో పని చేసే వారికి ఎక్కువ అవకాశాలు లభించవచ్చు. సమాజంలో గౌరవ, మర్యాదలు ఉంటాయి. పూర్వీకుల నుంచి ఆస్తిని పొందుతారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలను పొందుతారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.

3.మకర రాశి:

మకర రాశి వారికి నవంబర్ నెల బాగా కలిసి వస్తుంది. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులను చూస్తారు. భూమి, ఆస్తికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.

రాజకీయాల్లో ఉన్న వారికి కూడా ఇది మంచి సమయం. పిల్లల పట్ల మీ బాధ్యతను సక్రమంగా పూర్తి చేస్తారు. పిల్లల చదువు, ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలను వింటారు. ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టడానికి కూడా ఇది సరైన సమయం.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.