Naga panchami: రాహు, కేతు దోషాలు తొలగిపోయేందుకు ఆగస్ట్ 9న ఇలా చేయండి..
Naga panchami: రాహు, కేతువులు సమస్యలను సృష్టిస్తాయి. జాతకంలో ఈ గ్రహాలు అశుభ స్థానంలో ఉంటే అనేక కష్టాలు ఎదురవుతాయి. రాహు కేతు దోషాలు తొలగించుకునేందుకు నాగ పంచమి రోజు కొన్ని పరిహారాలు పాటించడం మంచిది.
Naga panchami: నవగ్రహాలలో రాహు, కేతువులు ఛాయా గ్రహాలు. ఈ రెండు గ్రహాలు మీ జాతకంలో మంచిగా ఉంటే అవి మీ జీవితంలో రాజయోగాన్ని తెస్తాయి. కానీ రాహువు, కేతువు స్థానాలు చెడుగా ఉంటే మీ జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. జాతకంలో ఈ రెండు నీడ గ్రహాల చెడు స్థానం కారణంగా ఒక వ్యక్తి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కఠినమైన పరిస్థితులు ఎదురైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు.
రాహువు మీ జాతకంలో శుభ స్థానంలో ఉంటే జీవితంలో ప్రతిదీ బాగుంటుంది. మీరు విదేశాలకు వెళతారు. మీరు సాంకేతిక రంగంలో పురోగతి సాధిస్తారు. మీ కెరీర్ బాగుంటుంది. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. జాతకంలో ఉన్న రాహు కేతు దోషాలను తొలగించుకోవడం కోసం నాగపంచమి ఉత్తమమైన రోజుగా చెప్తారు. ఈరోజు నాగదేవతను పూజించడం వల్ల రాహు కేతు దోషాలు, కాల సర్ప దోషం నుంచి విముక్తి కలుగుతుంది. నాగపంచమి రోజు వీటి నుంచి బయట పడేందుకు ఎటువంటి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటారో తెలుసుకుందాం.
నాగపంచమి ఎప్పుడు?
ప్రతి సంవత్సరం నాగ పంచమి పండుగను శ్రావణ మాసం శుక్ల పక్షంలోని పంచమి తిథి నాడు జరుపుకుంటారు. శ్రావణ మాసంలోని పంచమి తిథి ప్రకారం శుక్రవారం ఆగస్టు 9 నాడు నాగపంచమి జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం శ్రావణ మాసం శుక్ల పక్ష నవమి ఆగస్టు 8-9 తేదీలలో 12:36 గంటలకు ప్రారంభమై ఆగస్టు 10వ తేదీ తెల్లవారుజామున 03:14 గంటలకు ముగుస్తుంది. అందుకే ఆగస్ట్ 09న నాగ పంచమి జరుపుకోనున్నారు.
ఈ రోజున కాలసర్ప దోషం తొలగిపోవాలంటే శివుడిని పూజించి, మహామృత్యుంజయ మంత్రం జపం చేయండి. గంగాజలంలో నల్ల నువ్వులను కలిపి శివునికి అభిషేకం చేయండి. వెండి లేదా రాగితో చేసిన ఒక జత పాములను కూడా పవిత్ర నదిలో వదలడం చేయాలి. లేదంటే వాటిని శివలింగంపై సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల కాల సర్ప దోష ప్రభావం తగ్గుముఖం పడుతుంది.
రాహు కేతు దోషాలు పోగొట్టుకునేందుకు
రాహుకేతు దోష నివారణకు నాగ పంచమి నాడు తులసి మొక్కను నాటండి. ఈ రోజు చెట్టును నాటడం, సేవ చేయడం వల్ల రాహువు శాంతిస్తాడని చెబుతారు. అంతే కాకుండా మట్టి పాముని తయారు చేసి ఈ రోజు రావి చెట్టు కింద ఉంచండి. రాహువు చెడు ప్రభావాలను తొలగించడానికి పేదలకు దానం చేయాలి. నవనాగ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితం కలుగుతుంది. అలాగే రాహు, కేతువులను శాంతపరిచే మంత్రాలు పఠించాలి.
ఈరోజు నాగదేవతను పూజించడం ద్వారా జాతకంలో ఉన్న రాహు, కేతువులకు సంబంధించి లోపాలు తొలగిపోతాయి. పంచమి రోజున పూజించడం వల్ల అన్ని రకాల విఘ్నాలు తొలగిపోయి పాముల భయం నుంచి మానవులకు విముక్తి లభిస్తుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.