ఈశాన్య దిక్కులో ఇది ఉంటే.. ఇల్లంతా వ్యాధులే-northeast direction vastu tips find dos and donts in eesanya disha ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Northeast Direction Vastu Tips Find Dos And Donts In Eesanya Disha

ఈశాన్య దిక్కులో ఇది ఉంటే.. ఇల్లంతా వ్యాధులే

HT Telugu Desk HT Telugu
May 11, 2023 04:56 PM IST

వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిక్కుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈశాన్య దిశ చాలా ప్రత్యేకమైనది. దీనిపై శ్రద్ద పెట్టాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఈశాన్య దిక్కు దైవ స్వరూపం
ఈశాన్య దిక్కు దైవ స్వరూపం

వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిశను ఈశాన్య కోణం అంటారు. ఇంటి యొక్క ఈ దిశ చాలా ముఖ్యమైనది. పవిత్రమైన ఈ దిక్కు ఆరోగ్యం, ఆనందం, సంపదతో నేరుగా సంబంధం కలిగి ఉంటారు. తూర్పు, ఉత్తర మధ్య దిశను ఈశాన్య దిశ అంటారు. ఉదయం సూర్యరశ్మి సోకే దిక్కు. సూర్యరశ్మికి అనారోగ్యాన్ని నయం చేసే శక్తి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

ఇంట్లో ఈశాన్య దిక్కులో ఉండకూడనివి

  1. ఇంటి ఈశాన్య దిక్కులో అపరిశుభ్రంగా ఉంచకూడదు. లేదంటే ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటారు. వ్యాధులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
  2. ఈశాన్య దిశలో మరుగు దొడ్డి ఉంటే దానిని తొలగించాలి. మరుగు దొడ్డి ఉంటే ఇల్లు వ్యాధులకు నిలయంగా మారుతుంది. వెంటనే తొలగించడం సాధ్యం కాకపోతే ఆ మరుగు దొడ్డిలో ఒక గాజు గిన్నెలో సముద్రపు ఉప్పు, కర్పూరం, పటిక ఉంచండి.
  3. ఈశాన్య దిక్కులో వంట గది ఉండడం కూడా అనారోగ్యానికి కారణమవుతుంది. మార్చడం సాధ్యం కాకపోతే గ్యాస్ బండ కింద ఆకుపచ్చ టైల్ లేదా రాయిని ఉంచండి.
  4. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య మూలను మూసివేసినట్టుగా గదులు గానీ, ఏ విధమైన కట్టడాలు గానీ నిర్మించరాదు.
  5. ప్రధాన ద్వారం దగ్గర జంతువుల చిహ్నాలు ఉంచరాదు.
  6. ఈశాన్య దిశలో లోపల గానీ, బయట గానీ మెట్లు ఉండరాదు.
  7. ఈశాన్యంలో బెడ్ రూమ్ ఉండకూడదు.
  8. ఈశాన్యంలో షూ రాక్ ఉంచరాదు. నైరుతి లేదా పడమర దిక్కులో షూ రాక్ ఉండాలి.

ఈశాన్య దిశలో ఏం ఉండాలి

  1. ఈశాన్య దిశలో పూజా గది ఉండడం మంచిది.
  2. ఈశాన్య దిక్కులో దేవుడి చిత్రపటాలు ఉండాలి.
  3. ఇంటి నిర్మాణం జరిపేటప్పుడు ప్రధాన ద్వారం ఈశాన్యంలో నిర్మించుకోవాలి. ఇతర ద్వారాల కంటే ఇది పెద్దదిగా ఉండాలి.
  4. ప్రధాన ద్వారానికి శుభ చిహ్నాలతో తోరణాలు అలంకరించాలి.
  5. ఇంట్లో ఈశాన్య దిక్కులో ఎలాంటి బరువులు ఉండరాదు. ఏవైనా బరువులు ఉంటే తీసేయండి.
  6. ఈశాన్య మూలం పెరిగి ఉన్న స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే సకల సంపదలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
  7. బోరు నిర్మాణం ఈశాన్యంలో ఉంటే శ్రేష్టం.
  8. ఈశాన్యం నీటితో సంబంధం ఉంది కనుక ఈశాన్య గోడకు లేత నీలిరంగు వేయొచ్చు. దైవంతో సంబంధం ఉంది కనుక లేద పసుపు రంగు వేయొచ్చు.
  9. ఈశాన్యంలో చిన్న నీటి తొట్టెలు సానుకూల శక్తిని తెచ్చి పెడతాయి.
  10. ఫిష్ అక్వేరియం కూడా సానుకూల శక్తిని తెస్తుంది. ముఖ్యంగా అందులో 9 బంగారు చేపలు, ఒక నల్ల చేప ఉంటే అదృష్టం కలిసొస్తుందని నమ్ముతారు.
  11. ఈశాన్యంలో తులసి మొక్క నాటితే చాలా మంచిది. ప్రతికూల శక్తులను నశింపజేసి సానుకూల శక్తులను ప్రసరింపజేస్తుంది.
  12. ఈశాన్య దిక్కులో ఆవు దూడ, కామధేనువు, బుద్ధుడి విగ్రహాలను పెట్టుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్