హిందూ మతంలో నిర్జల ఏకాదశికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు విష్ణువు ఆరాధనకు ప్రత్యేకమైనదిగా భావిస్తారు. నిర్జల ఏకాదశి వ్రతాన్ని జ్యేష్ఠ మాసం శుక్ల పక్షం ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే సంవత్సరం పొడవునా ఏకాదశి ఉపవాసాలు చేసినంత ఫలితం ఉంటుంది.
ఈసారి నిర్జల ఏకాదశి జూన్ 6న ఉదయం 1:00 కి ప్రారంభమవుతుంది. జూన్ 6వ తేదీ శుక్రవారం ఉపవాస దీక్ష చేపట్టాలి. నిర్జల ఏకాదశి ఉపవాసం పాటించాలనుకుంటే, నీటికి సంబంధించిన ఈ నియమాలను తెలుసుకోండి.
నిర్జల ఏకాదశి నాడు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండవచ్చు. నీరు తాగకుండా ఉపవాసం ఉండటం చాలా కష్టమనిపిస్తే సూర్యాస్తమయం తర్వాత రెండు గంటల తరువాత నీరు త్రాగవచ్చు. ఇది 12 ఏకాదశుల వరకు ఉపవాస ఫలాలను ఇస్తుందని చెబుతారు.
నిర్జల ఏకాదశిని భీమసేని ఏకాదశి అని కూడా అంటారు.ఈ ఉపవాస సమయంలో భక్తులు ఆహారం, నీరు తీసుకోరు. హిందూ పురాణాల ప్రకారం నిర్జల లేదా భీమసేని ఏకాదశి రోజున కొన్ని తప్పులు చేయకూడదు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఈ రోజున అన్నం తినకూడదు. హిందూ విశ్వాసాల ప్రకారం ఈరోజు అన్నం తింటే, ఆ వ్యక్తి మరుజన్మలో పురుగుగా పుడతాడు.
2. ఈ రోజున ఉప్పు తినకూడదు. ఉప్పు తినడం వల్ల ఏకాదశి, బృహస్పతి ఫలితాలను పొందలేరు.
3. ఏకాదశి రోజున తులసికి నీటిని సమర్పించకూడదు, తులసిని తాకకూడదు.ఈ రోజున తులసి కూడా ఉపవాసం ఉంటుందని నమ్ముతారు. తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు.
4. ఈ రోజు ఎవరిపైనా చెడు లేదా అసభ్యకరమైన పదాలను ఉపయోగించవద్దు. ఈ రోజు కోపం తెచ్చుకోవద్దు, అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి.
5. ఏకాదశి రోజున జుట్టు లేదా గోర్లు కత్తిరించడం అశుభంగా భావిస్తారు.
1. ఏకాదశి రోజున లక్ష్మీదేవిని, విష్ణు మూర్తిని వీలైనంత ఎక్కువగా పూజించాలి.
2. విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి.
3.ఈ రోజు నిరుపేదలకు సహాయం చేస్తే మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.