Lucky zodiac signs: రానున్న రెండు నెలలు ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్- ఆదాయం, ఆనందంతో జీవిస్తారు-next two months in 2024 these zodiac signs get full benefits form planet transition ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lucky Zodiac Signs: రానున్న రెండు నెలలు ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్- ఆదాయం, ఆనందంతో జీవిస్తారు

Lucky zodiac signs: రానున్న రెండు నెలలు ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్- ఆదాయం, ఆనందంతో జీవిస్తారు

Gunti Soundarya HT Telugu

Lucky zodiac signs: ఇంక ఈ ఏడాది పూర్తి కావడానికి రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ రెండు నెలలు ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి. గ్రహాల సంచారం ఏ విధమైన ప్రభావం చూపుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం.

రానున్న రెండు నెలలు వీరికి డబ్బే డబ్బు

నవగ్రహాల కదలిక మానవ జీవితం మీద ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. నిర్దిష్ట సమయంలో తర్వాత ఒక గ్రహం తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు కదలిక తిరోగమనmలో కూడా సంచరిస్తుంది. ఇది అన్ని రాశుల మీద ప్రత్యేక ప్రభావాలను చూపుతుంది.

ప్రస్తుతం శుక్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. నవంబర్ మొదటి వారంలో ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని తర్వాత నవంబర్ 15న శని తన సొంత రాశి కుంభ రాశిలో ప్రత్యక్ష మార్గంలో సంచరిస్తాడు. అలాగే నవంబర్ 16న సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 16 వరకు ఇదే రాశిలో ఉంటాడు. అనంతరం నవంబర్ 26న బుధుడి సంచారం ఉంటుంది. ఈ గ్రహాల కదలిక వల్ల ఐదు రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ ఏడాది చివరిలో రానున్న రెండు నెలలు ఈ రాశుల వారికి అద్భుతంగా మారబోతుంది. వీరికి దీపావళి సంబరాలు రెండు నెలల పాటు సాగినట్లుగా అనిపిస్తుంది. ఏ ఏ రాశుల వారికి ఏడాది చివరి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందో తెలుసుకుందాం.

వృషభ రాశి

వృషభ రాశిలో ప్రస్తుతం బృహస్పతి తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. అందువల్ల ఈ రాశి వారికి నవంబర్, డిసెంబర్ నెలలు చాలా శుభ ఫలితాలను ఇస్తాయి. డబ్బు లభిస్తుంది. కొత్త ఉద్యోగం పొందుతారు. మంచి వ్యాపారం ఉంటుంది. ఏ పని తలపెట్టిన అందులో లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి రానున్న రెండు నెలలు కులాసాగా గడిచిపోతుంది. దీపావళి నుంచి క్రిస్మస్ వరకు వీరికి సమయం చాలా బాగుంటుంది. ఉద్యోగంలో పదోన్నతితో పాటు ఆకస్మిక ధనం కూడా లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. పెద్ద విజయాలను సాధిస్తారు.

తులా రాశి

రాబోయే రెండు నెలలు తులా రాశి వారికి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. నిరుద్యోగులు ఉద్యోగాలలో విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగం పొందాలని కల నెరవేరుతుంది. అనేక కొత్త అవకాశాలు తారసపడతాయి. ఒంటరిగా ఉన్నవారికి ఏడాది చివరలో మంచి భాగస్వామి దొరుకుతుంది. పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఏడాది చివరి రెండు నెలలు అద్భుతంగా గడుస్తుంది. ఊహించని ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో బాగా డబ్బు సంపాదిస్తారు. అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అందరితో కలిసి ఎక్కడికైనా ట్రిప్ కు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త శిఖరాలను అందుకుంటారు.

కుంభ రాశి

కుంభ రాశిలో శని ప్రత్యక్ష మార్గంలో సంచరిస్తాడు. అందువల్ల ఈ రాశి వారికి రాబోయే రెండు నెలలు గోల్డెన్ పీరియడ్ గా మారిపోతుంది. మీ జీవితంలో చాలా కాలంగా ఎదురు చేస్తున్న మార్పు ఈ సమయంలో చోటు చేసుకుంటుంది. బలమైన నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో పురోగతి సాధిస్తారు. కొత్త విజయాలు నమోదు చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే మంచి రాబడి ఇస్తాయి. కొత్త సంవత్సరం నుంచి కుంభ రాశిలో శని సంచారం ముగుస్తుంది. అందువల్ల ఈ రాశి వారికి ఏలినాటి శని నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ఫలితంగా వీరికి అనేక శుభకార్యాలు జరుగుతాయి

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.