New Year Vastu Tips: న్యూఇయర్ ముందు వీటిని మీ ఇంట్లో పెట్టారంటే.. సంవత్సరం అంతా ఆనందంగా ఉండొచ్చు-new year vastu tips keep these things at your home and you get full luck and limitless happiness in 2025 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  New Year Vastu Tips: న్యూఇయర్ ముందు వీటిని మీ ఇంట్లో పెట్టారంటే.. సంవత్సరం అంతా ఆనందంగా ఉండొచ్చు

New Year Vastu Tips: న్యూఇయర్ ముందు వీటిని మీ ఇంట్లో పెట్టారంటే.. సంవత్సరం అంతా ఆనందంగా ఉండొచ్చు

Peddinti Sravya HT Telugu
Dec 31, 2024 07:00 AM IST

New Year Vastu Tips: 2025 లో చాలా మంది అనేక రకాల మార్పులు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు అయితే 2025లో మీకు అదృష్టం కలిసి రావాలన్నా, మంచి జరగాలన్నా, సానుకూల శక్తి మీ ఇంట్లో ప్రవహించాలన్నా ఈ మార్పులు చేసుకోండి. ఇలా మీ ఇంటిని అందంగా అలంకరించుకుంటే సానుకూల శక్తి పెరిగి ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

New Year Vastu Tips: న్యూఇయర్ ముందు వీటిని మీ ఇంట్లో పెట్టారంటే
New Year Vastu Tips: న్యూఇయర్ ముందు వీటిని మీ ఇంట్లో పెట్టారంటే (pinterest)

చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం మనం అనుసరించడం వలన ఎన్నో మార్పులు కనపడతాయి. వాస్తు ప్రకారం మన ఇంట్లో ఈ మార్పులు చేసుకోవడం వలన సానుకూల శక్తి పెరిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంతోషంగా ఉండడానికి అవుతుంది. ఇక కొత్త సంవత్సరం వచ్చేస్తోంది.

yearly horoscope entry point

2025 లో చాలా మంది అనేక రకాల మార్పులు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు అయితే 2025లో మీకు అదృష్టం కలిసి రావాలన్నా, మంచి జరగాలన్నా, సానుకూల శక్తి మీ ఇంట్లో ప్రవహించాలన్నా ఈ మార్పులు చేసుకోండి. ఇలా మీ ఇంటిని అందంగా అలంకరించుకుంటే సానుకూల శక్తి పెరిగి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేస్తే కొత్త సంవత్సరం మీ ఇంట్లో కష్టాలు తొలగిపోతాయి.

కొత్త సంవత్సరం మీ ఇంట అదృష్టం కలగాలంటే ఈ మార్పులు చేయడం మర్చిపోకండి

నెమలీకలు

ఇంట్లో నెమలీకలని పెట్టడం వలన చక్కటి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. సంతోషంగా జీవించడానికి అవుతుంది. మీ ఇంట మంచి జరగాలంటే నెమలీకలని ఇంట్లో పెట్టుకోవడం మర్చిపోకండి. కొత్త సంవత్సరం నెమలికలతో అందంగా ఇంటిని అలంకరించండి.

మనీ ప్లాంట్

ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే ఎంత మంచి జరుగుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టడం వలన అదృష్టం కలిసి వస్తుంది. మీ ఇంట్లో ఉత్తరం వైపు ఒక మంచి మనీ ప్లాంట్ పెట్టుకోండి. ఇక మీకు ఏడాది అంతా తిరుగు ఉండదు. కనుక కొత్త సంవత్సరం మనీ ప్లాంట్ ని పెట్టుకోవడం కూడా మర్చిపోవద్దు.

బుద్ధుడి విగ్రహం

బుద్ధుడి విగ్రహం ఇంట్లో ఉంటే ప్రశాంతత కలుగుతుంది. ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. కొత్త సంవత్సరం చాలామంది మంచి జరగాలని అనుకుంటారు. ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా బుద్ధుడి విగ్రహాన్ని ఇంట్లో అలంకరణగా పెట్టుకోండి, ఇక మీకు తిరుగు ఉండదు.

దేవుడి విగ్రహాలు

దేవుడు విగ్రహాలను కొత్త సంవత్సరం ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం వలన మంచి జరుగుతుంది. ప్రతికూల శక్తిని తొలగించగలవు. మీ ఇష్ట దైవానికి సంబంధించిన విగ్రహాలను లేదంటే వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టడం లాంటివి చెయ్యొచ్చు. ఇవి చక్కటి ఎనర్జీని అందిస్తాయి, అదృష్టాన్ని కూడా తీసుకొస్తాయి. 2025లో సంతోషంగా ఉండొచ్చు.

విండ్ చైమ్స్

విండ్ చైమ్స్ మంచి సానుకూల శక్తిని కలిగిస్తాయి. ప్రతికూల శక్తిని తొలగించుతాయి. వీటిని అలంకరణగా మనం ఉపయోగించవచ్చు. అనేక రకాల డిజైన్స్ లో మనకి ఇవి దొరుకుతాయి నచ్చిన వాటిని కొనుగోలు చేసి ఇంట్లో పెట్టవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner