New Year 2025 Mantras: ఈ మంత్రాలతో కొత్త సంవత్సరాన్ని మొదలు పెడితే మీ సమస్యలు తీరిపోవచ్చు.. ఏడాదంతా సంతోషంగా ఉండొచ్చు
New Year 2025 Mantras: 2024లో ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారో వాటిని తొలగించుకోవాలని.. జీవితాంతం ఏడాది అంతా హాయిగా, ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. మీరు కూడా అలానే అనుకుంటున్నారా? అయితే మీ న్యూ ఇయర్ ని ఈ శ్లోకాలతో మొదలు పెట్టండి.
ప్రతీ ఒక్కరు కూడా కొత్త సంవత్సరం సంతోషంగా ఉండాలని, ఏ బాధలు లేకుండా హాయిగా ఉండాలని.. ఏడాది మొత్తం ఏ కష్టం రాకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే కొత్త సంవత్సరం చాలా మంది జరిగినవి మళ్లీ జరగకూడదని అందుకోసం భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటారు.
2024లో ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారో వాటిని తొలగించుకోవాలని.. జీవితాంతం ఏడాది అంతా హాయిగా, ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. మీరు కూడా అలానే అనుకుంటున్నారా? అయితే మీ న్యూ ఇయర్ ని ఈ శ్లోకాలతో మొదలు పెట్టండి. ఇలా మీరు భగవంతుడిని ఆరాధిస్తూ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించినట్లయితే సంతోషంగా ఉండొచ్చు. సంవత్సరం అంతా మీకు సంతోషం కలిగి బాధలు కూడా పోయే అవకాశం ఉంది.
కొత్త సంవత్సరం మీ రోజుని ఈ మంత్రాలు/ శ్లోకాలతో మొదలుపెట్టండి
ఓం గం గణపతయే నమః
ఓం గం గణపతయే నమః అని వినాయకుడుని ఆరాధిస్తూ చెప్పండి. ఈ మంత్రాన్ని జపిస్తే విఘ్నాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. మనం ఏ పూజ చేసినా మొట్టమొదట వినాయకుడిని ఆరాధిస్తాము. విఘ్నాలు ఏమీ కలగకుండా చేపట్టిన పని పూర్తి అవ్వాలని వినాయకుడుని ఆరాధిస్తాము. కొత్త సంవత్సరం సంతోషంగా ఉండడానికి వినాయకుడు మంత్రాన్ని పఠించినట్లయితే సంతోషంగా ఉండొచ్చు.
ఓం శాంతి శాంతి శాంతి
ప్రశాంతంగా ఉండడానికి లోపల మనశ్శాంతి కలగడానికి ఈ మంత్రాన్ని జపించండి. ఓం శాంతి శాంతి శాంతి అంటే చాలా హాయిగా ఉంటుంది. ఈ మంత్రాన్ని జపిస్తే ఎంతో ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి కొత్త సంవత్సరం ఈ మంత్రాన్ని కూడా జపించండి.
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ అనేది చాలా శక్తివంతమైన మంత్రం. శివుడుని ఆరాధిస్తూ ఈ మంత్రాన్ని జపిస్తే మంచి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. సంతోషంగా ఉండొచ్చు. అలాగే ఈ మంత్రాన్ని జపిస్తే శివుని అనుగ్రహం కూడా కలుగుతుంది.
లోకా సమస్త సుఖినోభవంతు
ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకోవడం ఎంతో మంచి లక్షణం. మనతో పాటుగా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి. అప్పుడు మనం కూడా బావుంటాము. కొత్త సంవత్సరం మంచి శ్లోకంతో మీరు మీ రోజున మొదలు పెట్టాలనుకుంటే ఈ శ్లోకాన్ని కూడా మీరు చదువుకోవచ్చు.
ఓం మహా లక్ష్మహే విద్మహే విష్ణు ప్రియయే ధీమహి
ఈ శ్లోకాన్ని చదువుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. కొత్త సంవత్సరం మీరు అదృష్టాన్ని పొందాలనుకుంటే ఈ శ్లోకాన్ని తప్పకుండా చదువుకోండి.
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ.. నిర్వీగ్నం కురుమే దేవా సర్వకారేషు సర్వదా
వినాయకుడిని ఆరాధించేటప్పుడు ఈ శ్లోకాన్ని కూడా జపించండి. ఇది చదవడం వలన వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. పైన చెప్పినట్లుగా విఘ్నలూ తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.
ఓం నమో నారాయణ శ్రీమన్నారాయణ హరి హరి
ఈ మంత్రాన్ని చదివి విష్ణు మూర్తిని ఆరాధించండి. ఈ మంత్రాన్ని చదివితే కూడా సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఏడాది అంతా విష్ణు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలని విష్ణుమూర్తిని కోరుకోండి.
ఇలా కూడా
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి సంతోషంగా ఉండాలంటే శివుని మహామృత్యుంజయ రూపాన్ని ధ్యానించాలి. ఇలా చేయడం వలన వ్యాధులకు భయపడక్కర్లేదు. అనారోగ్య సమస్యలు కి దూరంగా ఉండొచ్చు ఆరోగ్యంగా జీవించొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం