Goddess lakshmi devi: సాయంత్రం వేళ పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు
Goddess lakshmi devi: సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఏం పనులు చేయకూడదో తెలుసుకుందాం.
Goddess lakshmi devi: హిందూమతంలో సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయడం నిషిద్ధంగా భావిస్తారు. సాయంత్రం వేళ ఏదైనా పనిచేయడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో దురదృష్టం వస్తుందని నమ్ముతారు. దీనితో పాటు వ్యక్తి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రంలో సూర్యాస్తమయం తర్వాత చేయకూడని విషయాల గురించి వివరించారు. సాయంత్రం వేళ ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం.

పసుపు దానం చేయకూడదు
దనాధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ దానం చేసేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. దానం చేయాలనుకున్న వస్తువులు ఏవైనా ఉదయం పూట మాత్రమే ఇవ్వాలి. వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత కొన్ని దానం చేయకూడదు. అందులో ఒకటి పసుపు. దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. పసుపుని ఎక్కువగా శుభకార్యాలలో ఉపయోగిస్తారు. దేవగురువు బృహస్పతితో పసుపు సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. గురు గ్రహం సంపదకు కారకంగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో సాయంత్రం వేళ పసుపు దానం చేయడం వల్ల బృహస్పతి అనుగ్రహం కోల్పోతారు. ఇంట్లో ఆర్థిక పురోగతి ఆగిపోతుందని పండితులు సూచిస్తున్నారు.
ఇంటిని శుభ్రం చేయకూడదు
హిందూ మతంలో చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. సూర్యాస్తమయం తర్వాత ఇంటికి శుభ్రం చేయకూడదని అంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అసంతృప్తికి గురవుతుందని చెబుతారు. ఇంట్లో లైట్లు వేయకముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. లైట్లు వేసిన తర్వాత ఇల్లు శుభ్రం చేయకుండా ఉండటమే మంచిది. అలాగే ఇల్లు ఊడ్చిన తర్వాత చెత్త బయట వేయకుండా మూత పెట్టిన డస్ట్ బిన్ లో వేసుకోవాలి.
పాలు పెరుగు ఇవ్వకూడదు
వాస్తు నిపుణులు చెప్పే దాని ప్రకారం సాయంత్రం సమయంలో దానం చేయకూడని వస్తువుల్లో ముఖ్యంగా పాలు, పెరుగు, పంచదార వంటివి ఉన్నాయి. ఎంత అవసరం ఉన్నా కూడా సాయంత్రం పూట వీటిని దానం చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారని అంటారు. పాలను లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తారు . అటువంటి వాటిని దానం చేయడం వల్ల ఇంట్లోని లక్ష్మిని ఇతరులకు ఇచ్చినట్టుగా చెప్తారు.
అప్పు ఇవ్వకూడదు
సాయంత్రం ఆరు తర్వాత డబ్బుకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరపడం మంచిది కాదు. ముఖ్యంగా ఈ సమయంలో చిన్న మొత్తాన్ని కూడా అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు. ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత తీసుకున్న రుణం ఎప్పటికీ తీర్చలేకపోతారని అంటారు. ధన నష్టం జరుగుతుంది.
తులసి ఆకులు కోయకూడదు
తులసి మాత లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. సాయంత్రం తులసి ఆకులు కోయడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుందని చెబుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి మొక్క దగ్గర సాయంత్రం వేళ దీపం వెలిగించాలి. అలాగే సాయంత్రం తులసికి నీరు సమర్పించకూడదు, తాకకూడదు
చీకటి ఉండకూడదు
మత విశ్వాసాల ప్రకారం సాయంత్రం సమయంలో దేవతలు విహారయాత్రలకు వెళతారని నమ్ముతారు. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఏ మూలలోనూ చీకటి ఉండకూడదు. అలా ఉంటే ఇంటి ఆనందం, శ్రేయస్సు పై చెడు ప్రభావం చూపుతుంది. తప్పనిసరిగా ఇంటి ముందు దీపం వెలిగించాలి.
టాపిక్