సాయంత్రం పూట ఈ పనులు చేస్తే పరమ దరిద్రం.. మీకు అన్ని సమస్యలే-never do these things in evening time for get rid of poverty at home ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సాయంత్రం పూట ఈ పనులు చేస్తే పరమ దరిద్రం.. మీకు అన్ని సమస్యలే

సాయంత్రం పూట ఈ పనులు చేస్తే పరమ దరిద్రం.. మీకు అన్ని సమస్యలే

Anand Sai HT Telugu

Eventing Time : కొన్ని రకాల పనులు సాయంత్రంపూట చేస్తే అనేక సమస్యలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దరిద్రం మీతోనే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అలా సాయంత్రం సమయంలో చేయకూడని పనులు తెలుసుకుందాం..

సాయంత్రం చేయకూడని పనులు (Unsplash)

మనలో చాలా మంది ఇప్పటికీ వాస్తు శాస్త్రాన్ని నమ్ముతుంటారు. చాలా మంది తమ ఇంట్లోని ప్రతిదీ వాస్తు ప్రకారం ఉండాలని కోరుకుంటారు. ఇంటి నిర్మాణం నుండి ఇంటి లోపల వస్తువులను ఎక్కడ ఉంచాలో వాస్తు చెబుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచకూడని వస్తువులను కచ్చితంగా పాటిస్తారు. ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మి ఉంటుంది, ఆరోగ్యం, ఆదాయం ఇలా అన్నీ పెరుగుతాయని నమ్మకం.

వాస్తు పాటిస్తే.. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతారు. లేదంటే అంతా గందరగోళం అవుతుంది. కానీ ఇప్పుడు మనం అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం పూట ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని కార్యక్రమాలు చేయకూడదు. ఇలా చేయడం కష్టాలకు కారణం అవుతుందని పండితులు అంటున్నారు. ఆ విషయాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం...

వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం పూట స్త్రీలను తిట్టకూడదు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు వాస్తు పండితులు. దీపం వెలిగించే సమయం సాయంత్రం, ఆ సమయంలో స్త్రీల మనస్సు ఆనందంగా ఉండాలి. అందుకే సాయంత్రం పూట ఇంట్లోనే కాదు ఆఫీసులో కూడా ఆడవాళ్ళను వేధిస్తూ, నిందలు వేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవికి ఒక్కసారి కోపం వస్తే ఇక మీ దగ్గరకు రాదు. కాబట్టి సాయంత్రం వేళల్లో స్త్రీలతో గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది.

మనలో చాలా మందికి సాయంత్రం పూట నిద్ర వస్తుంది. దీనికి చాలా కారణాలున్నాయి. చాలా మంది తమ పని పరిస్థితుల కారణంగా సాయంత్రం నిద్రపోతారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ సాయంత్రం నిద్రపోకూడదు. ఇలా నిద్రించేవారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఆ సమయంలో నిద్రపోకుండా ప్రయత్నించండి. వీలైతే మీ ముఖం కడుక్కున్న తర్వాత ఏదైనా చేయడానికి ప్రయత్నించండి. అయితే మీకు నిద్ర వస్తున్నట్టుగా అనిపిస్తే మీరు ఎవరితోనైనా మాట్లాడటం ప్రారంభిస్తే అది మారవచ్చు.

సాయంత్రం పూట మీ ఇంటిని శుభ్రం చేయడానికి చీపురు ఉపయోగించకండి. ఆ సమయంలో ఇంటిని అస్సలు శుభ్రం చేయకూడదని చెబుతారు. సాయంత్రం చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లోని శుభకార్యాలన్నీ వెళ్లిపోతాయని పండితులు అంటున్నారు. అదే సమయంలో లక్ష్మిదేవి కూడా వెళ్లిపోతుంది. సాయంత్రం చీపురుతో మీ ఇంటిని శుభ్రం చేయకండి. సాయంత్రం దీపం వెలిగిస్తే ఇంట్లో అన్ని రకాల పాజిటివ్ ఎనర్జీలు వస్తాయి.

తులసి మొక్కకు సాయంత్రం పూట నీరు పెట్టకూడదు. అదేవిధంగా సాయంత్రం పూట తులసి మొక్క ఆకులు, పూలు, కాయలు తీయకూడదు.. ఇలా చేసినా లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా లక్ష్మీదేవి కరుణించదు. మీరు మునుపెన్నడూ లేని కష్టాలను, పేదరికాన్ని ఎదుర్కొంటారు. సాయంత్రం పూట ఇలాంటి పనులు చేయకండి.

శుక్రవారం నాడు బియ్యం, ఉప్పు, మిరపకాయలు, చింతపండు, పప్పు, ఆవాలు, మిరియాలు, జీలకర్ర, పసుపు, నూనె, పంచదార, నెయ్యి, కూరగాయలు వరుసగా పెట్టి పూజ చేసి హారతి చేయండి. జీవితంలో ఇబ్బందులు ఉండకూడదనుకుంటే.. ప్రతి శుక్రవారం సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు పూజ గదిలో పూజ చేయాలని నిపుణులు చెబుతున్నారు.