Navaratri 2022 Day 9। మహిషాసుర మర్ధినిగా దర్శనమిస్తున్న అమ్మవారు.. నవమి రోజు పూజ ఇలా చేయాలి!-navaratri 2022 day 9 mahishasura mardhini avataram know what do on maharnavami ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Navaratri 2022 Day 9। మహిషాసుర మర్ధినిగా దర్శనమిస్తున్న అమ్మవారు.. నవమి రోజు పూజ ఇలా చేయాలి!

Navaratri 2022 Day 9। మహిషాసుర మర్ధినిగా దర్శనమిస్తున్న అమ్మవారు.. నవమి రోజు పూజ ఇలా చేయాలి!

HT Telugu Desk HT Telugu
Oct 04, 2022 04:29 AM IST

Navaratri 2022 Day 9: నవరాత్రులలో 9వ రోజు మహిషాసుర మర్ధిని దేవీగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. 9వ రోజు పూజా విధానం, అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు, ఇతర విశేషాలను పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకరశర్మ గారు వివరించారు. తొమ్మిదవ రోజుకు సంబంధించిన అన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

Navaratri Day 9 : Mahishasura Mardhini Avataram
Navaratri Day 9 : Mahishasura Mardhini Avataram

Navaratri 2022 Day 9: దేవీ నవరాత్రులలో తొమ్మిదవ అవతారం సిద్ధి ధాత్రి | మహిషాసురమర్దిని అవతారం. కొన్ని ప్రాంతాలలో అమ్మవారిని ఈ రోజు సిద్ది ధాత్రిగా పూజిస్తారు. దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధి ధాత్రి. ఈమె సర్వ సిద్ధులను ప్రసాదించే శక్తి అవతారం. పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతోనే పొందినట్టుగా దేవీ పురాణములో ఉంది. ఈ రోజు అమ్మవారిని మహిషాసుర మర్ధిని దేవిగా పూజించాలి.

నవరాత్రి 9 రోజులు 9 అలంకరణలు 9 రకాల దేవతారాధనలు 9 రకాల నైవేద్యములు ఆచరించడం విశేషం. ఈ రోజు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష నవమి, దీనినే మహర్నవమి అనెదరు. ఈరోజు అమ్మవారిని శ్రీ మహిషాసురమర్ధినిగా పూజించాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అమ్మవారిని నీలము రంగు వస్త్రముతో అలంకరించాలి. బెల్లము పరమాన్నము నైవేద్యముగా సమర్పించాలి. ఈరోజు అమ్మవారు మహిషాసురుని సంహరించినట్లుగా పురాణాలు తెలియచేస్తున్నాయి.

సనాతన ధర్మంలో దైవారాధనలు మూడు రకములు

1. శివారాధన

శక్తి ఆరాధన అనగా అమ్మవారైనటువంటి సరస్వతి, లక్ష్మీ అలాగే దుర్గాదేవి ఆరాధన. శక్తి ఆరాధనలకు శరన్నవరాత్రులకు మించినటువంటి రోజు మరొకటి లేదు. విజయవాడ కనకదుర్గమ్మ అలంకరాల ప్రకారం నవరాత్రులలో తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసుర మర్ధిని దేవీ అవతారం అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. దేవీ నవరాత్రులో ప్రాంతాలను బట్టి అమ్మవారి అలంకరణలు ఉంటాయి.

దేవీ పురాణము- సింహవాహినిగా మహిషాసుర మర్ధిని

దేవీ భాగవతం ప్రకారం పూర్వం మధుకైటంబులు అనే రాక్షసులను వధించటానికి బ్రహ్మదేవుని కోరికపై విష్ణువుని మహా మాయ నిద్రలేపడం జరిగింది. అయితే యోగనిద్ర నుండి నిద్రలేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ రాక్షసులతో యుద్ధం చేసినా, వారిని జయించలేకపోవడం జరిగింది. ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ మధుకైటంబు రాక్షసులను మోహపూరితులను చేసింది. దాంతో వారు మహావిష్ణువును మెచ్చుకుని నీకు ఏ వరం కావాలి అని ప్రశ్నించారు. శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతారు. దానితో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తధ్యమని గ్రహించి తమను నీరు లేనిచోట చంపమని కోరుతారు. అంతటితో శ్రీమహావిష్ణువు వారిని పైకెత్తి భూఅంతరాలలో సంహరించే సమయంలో.. మహా మాయ పదితలలతో, పది కాళ్ళతో, నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడెను. ఈ విధముగా మహా మాయ అయినటువంటి అమ్మవారితో మహావిష్ణువు రాక్షస సంహారం చేసెను. ఇలాగే కంస సంహారమునకు సహాయపడుటకై నందా అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణుడికి సహాయపడెను. సింహవాహినిగా మహిషాసురుడుని, సరస్వతీ రూపిణిగా సుంబ, నుసుంబులను అలాగే ఛండ ముండులను సంహరించిన ఛాముండిగా, లోకాలను కరువునుంచి రక్షించినందుకు శాఖాంబరిగా, దుర్గుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు దుర్గగా ఇలా నవరూపాలను అమ్మవారి అవతారాలుగా పురాణాలు చెబుతున్నాయి.

సంబంధిత కథనం