మనం తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా మనపై పెద్ద ప్రభావం పడేటట్టు చేస్తాయి. అందుకే మనం ఎలాంటి పొరపాట్లు చేసినా మన పెద్దలు సరి చేస్తూ ఉంటారు. ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని పొరపాట్ల వలన భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కూర్చున్నప్పుడు కాళ్లు కదపడం కూడా మంచి అలవాటు కాదు. చాలా మంది కూర్చున్నప్పుడు కాళ్లు కదుపుతూ ఉంటారు. మీకు కూడా ఈ అలవాటు ఉందా? ఇది చూశారంటే మీరు ఇప్పుడే మానుకుంటారు.
పూజ సమయంలో అస్సలు పాదాలను కదిలించకూడదు. ఇది అశుభం. పూజలో ఏకాగ్రత, అంకితభావం, మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. పాదాలని అలా కదుపుతూ ఉన్నట్లయితే ఏకాగ్రత దెబ్బతింటుంది. దేవతలకు ఆగ్రహం కలుగుతుంది. పూజ చేసిన ఫలితం దక్కదు.
తినేటప్పుడు కూడా కాళ్ళను కదపడం మంచిది కాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నపూర్ణను అవమానించినట్లు అవుతుంది. తినేటప్పుడు ఈ అలవాటుని మానుకోకపోతే ఆనందం తొలగిపోతుంది. శాంతి ఉండదు. శ్రేయస్సు పై ప్రభావం పడుతుంది. ఆర్థిక నష్టాలకు కూడా దారి తీస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం