Moon Transit in Mesha Rasi: మేష రాశిలో చంద్రుడు.. ఈ 3 రాశులకు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు-moon transit in mesha rasi and these 3 rasis will get lots of benefits including wealth happiness and many more see now ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Moon Transit In Mesha Rasi: మేష రాశిలో చంద్రుడు.. ఈ 3 రాశులకు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు

Moon Transit in Mesha Rasi: మేష రాశిలో చంద్రుడు.. ఈ 3 రాశులకు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు

Peddinti Sravya HT Telugu

Moon Transit in Mesha Rasi: మార్చి 30న సాయంత్రం చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. దీంతో మూడు రాశుల వారికి అదృష్టం ఏర్పడింది. ఆ రాశుల వివరాలు ఇప్పుడు చూద్దాం. మీ రాశి కూడా ఇందులో ఉందేమో చెక్ చేసుకోండి.

Moon Transit in Mesha Rasi: మేష రాశిలో చంద్రుడు

గ్రహాల కదలిక ఆధారంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. గ్రహాల కదలిక ప్రకారం, రాశి చక్రాలపై మంచి ఫలితాలు, చెడు ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. చంద్రుడు మనసు, సంతోషం, నైతికత వంటి వాటికి ప్రతీక. నిర్దిష్టకాలం తర్వాత తన రాశిని చంద్రుడు మార్చుకుంటాడు.

దీంతో 12 రాశుల జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తే, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశులకి మాత్రం ఎంతో అదృష్టంతో పాటు ఊహించనివి జరనున్నాయి.

మేష రాశిలోకి చంద్రుడు

మార్చి 30న సాయంత్రం చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. దీంతో మూడు రాశుల వారికి అదృష్టం ఏర్పడింది. ఆ రాశుల వివరాలు ఇప్పుడు చూద్దాం. మీ రాశి కూడా ఇందులో ఉందేమో చెక్ చేసుకోండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి చంద్రుడు బలంగా ఉండడం కారణంగా కొన్ని అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారం చేసే వారికైతే వ్యాపారంలో భారీగా లాభాలు రాబోతున్నాయి. అప్పులు కూడా తీరవచ్చు. ఉద్యోగం చేసే వారికి పెద్ద కంపెనీలో పని వచ్చే అవకాశం ఉంది. సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది.

ధనస్సు రాశి

చంద్రుడు రాశి మార్పు కారణంగా ధనస్సు రాశి వారికి అనేక లాభాలు కలగబోతున్నాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవడంతో పాటుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వాహనాన్ని కొనుగోలు చేయడం వంటివి జరగచ్చు. పెళ్లి కానీ వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. పెళ్లయిన వాళ్ళ జీవితంలో సంతోషం ఉంటుంది.

వృషభ రాశి

చంద్రుడు మార్పు వలన వృషభ రాశి వారికి సంతోషం ఎక్కువవుతుంది. బంధుత్వాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అప్పులు తిరిగి చెల్లిస్తారు. వ్యాపారులు డబ్బు ఎక్కువ సంపాదించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆగిపోయిన పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.