ఈరోజు మకర రాశిలో చంద్రుని సంచారం, ఈ 3 రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు!-moon transit in makara rasi and it gives wealth happiness jobs to gemini leo and capricorn ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈరోజు మకర రాశిలో చంద్రుని సంచారం, ఈ 3 రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు!

ఈరోజు మకర రాశిలో చంద్రుని సంచారం, ఈ 3 రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు!

Peddinti Sravya HT Telugu

ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి ఈ చంద్రుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడి రాశి మార్పు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తే, కొన్ని రాశుల వారికి ఆ శుభ ఫలితాలను ఇస్తోంది. ఈ సమయంలో మూడు అదృష్ట రాశుల వారు వృత్తిలో పురోగతి సాధిస్తారు, ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.

ఈరోజు మకర రాశిలో చంద్రుని సంచారం (pixabay)

మే 18 అంటే ఈరోజు రాత్రి చంద్రుడు మకర రాశి లో సంచరిస్తాడు. చంద్రుడు రాశి మార్పుతో కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశుల వారు మానసిక ప్రశాంతతను పొందుతారు, పురోగతిని కూడా పొందవచ్చు. ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి ఈ చంద్రుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడి రాశి మార్పు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తే, కొన్ని రాశుల వారికి ఆ శుభ ఫలితాలను ఇస్తోంది.

ఈ సమయంలో మూడు అదృష్ట రాశుల వారు వృత్తిలో పురోగతి సాధిస్తారు, ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు, మానసిక ప్రశాంతత కలుగుతుంది. మరి ఈ మూడు రాశుల్లో మీరు కూడా ఒకరేమో చూసుకోండి.

మకర రాశిలోకి చంద్రుడు.. ఈ మూడు రాశులకు ఎన్నో లాభాలు

1.మిధున రాశి:

మిధున రాశి వారికి చంద్రుని సంచారం అనేక లాభాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, పనిని పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో సక్సెస్ ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కొత్త ప్రణాళికలు కూడా వేస్తారు.

2.సింహ రాశి:

సింహ రాశి వారికి ఈ సమయం కలిసి వస్తుంది. చంద్రుని సంచారం సానుకూల మార్పులను తీసుకువస్తుంది. కష్టపడే వారికి తగ్గ గుర్తింపు ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారు. వ్యాపారస్తులు భారీగా లాభాలను పొందుతారు. ధనలాభం ఉంటుంది. గొడవలకు దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండండి.

3.మకర రాశి:

మకర రాశి వారికి చంద్రుని సంచారం ఊహించని మార్పులను తీసుకువస్తుంది. చంద్రుని రాశి మార్పుతో మకర రాశి వారు ఆర్థికపరంగా మునుపటి కంటే మంచి స్థితిలో ఉంటారు. కుటుంబ సభ్యులతో బంధం బలంగా మారుతుంది. ఉద్యోగస్తులు కెరీర్‌లో సక్సెస్‌ను అందుకుంటారు. పూర్తికాని పనులను పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.