గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం జరుగుతుంది. చంద్రుడు మనస్సు, శాంతికి కారకుడు. త్వరలోనే చంద్రుడు రాశి మార్పు చెందుతాడు. ఇది కొన్ని రాశుల వరకే శుభ ఫలితాలను తీసుకువస్తుంది.
చంద్రుడు జూలై 31న తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. తులా రాశి అధిపతి శుక్రుడు. ధనం, సంపద, ఆస్తి మొదలైన వాటికి కారకుడు. చంద్రుడు తులా రాశిలోకి ప్రవేశించడంతో సానుకూల ఫలితాలను తీసుకొస్తాడు. కొన్ని రాశుల వారి జీవితంలో విజయాలు ఉంటాయి, అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు.
తులా రాశి వారికి సమయం బాగా కలిసి వస్తుంది. అదృష్టం ఉంటుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏవైనా కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కుంభ రాశి వారికి చంద్రుని రాశి మార్పు కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. కొత్త పనులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. విజయాలు అందుకుంటారు, శుభకార్యాలు జరుగుతాయి. సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి కూడా విజయాలు ఉంటాయి.
ధనుస్సు రాశి వారికి చంద్రుడి రాశి మార్పు శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది, శుభవార్తలు వింటారు. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రేమికులు ఇంట్లో వారి ప్రేమను తెలపడానికి ఇదే సరైన సమయం. పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.