Gaja kesari yogam: జులై 2న గజకేసరి యోగం.. ఈ రాశులకు ధన ప్రవాహం, అప్పుల నుంచి విముక్తి
Gaja kesari yogam: వృషభ రాశిలో చంద్రుడి సంచారం వల్ల బృహస్పతితో కలిసి గజకేసరి రాజయోగం ఏర్పడబోతుంది. రెండు రోజుల పాటు ఈ యోగం ఉంటుంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి లాభాలు కలుగుతాయి.
Gaja kesari yogam: జాతకంలో గజకేసరి రాజయోగం ఏర్పడటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. చంద్రుడు ఏదైనా గ్రహంతో సంయోగం చెందినప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో గజం అంతటి సంపద పొందుతారని చెబుతారు.
జ్యోతిషశాస్త్రంలో దేవగురువుగా భావించే బృహస్పతి అదృష్టం, పిల్లలు, సంతోషకరమైన వైవాహిక జీవితం, మతపరమైన కార్యకలాపాలు, సంపదకు కారకంగా పరిగణించబడుతుంది. దృక్ పంచాంగ్ ప్రకారం మే 1 నుండి బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఏడాది మొత్తం ఇదే రాశిలో ఉంటాడు. మే 13, 2025 వరకు ఈ రాశిలో ఉంటాడు.
అదే సమయంలో మనసు, బుద్ధి కారకుడైన చంద్రుడు జూలై 2, 2024 ఉదయం 11:14 గంటలకు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటాడు. జూలై 4న మధ్యాహ్నం 3:58 గంటల వరకు అదే రాశిలో ఉంటాడు. వృషభ రాశిలో గురు, చంద్రుల కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. గజకేసరి రాజయోగం ఏర్పడటం వలన వ్యక్తి మేధస్సు, జ్ఞానం అభివృద్ధి చెందుతుందని నమ్ముతారు. వ్యక్తి ప్రతి పనిలో ఆశించిన విజయాన్ని అందుకుంటాడు. పురోగతి మార్గంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. గజకేసరి యోగం వల్ల ఏ రాశుల వారికి మేలు కలుగుతుందో తెలుసుకుందాం.
మేష రాశి
గజకేసరి రాజయోగం ఏర్పడటం మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కలయికతో సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు అప్పుల నుండి విముక్తి పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం ఉంది. మాటలో సౌమ్యత ఉంటుంది. అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి. జ్ఞానం లభిస్తుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉంటుంది.
వృషభ రాశి
వృషభ రాశిలోనే గురు చంద్రుల కలయిక జరగబోతుంది. దీని ప్రభావంతో వృషభ రాశి వారి జీవితంలో జులై 2 నుండి అనేక అనుకూల మార్పులు వస్తాయి. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. డబ్బు ఆదా చేసుకోవడానికి కొత్త అవకాశాలు ఉంటాయి. ఆర్థిక కోణం బలంగా ఉంటుంది. ఆధ్యాత్మికత మీద మనసు వెళ్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి.
కన్యా రాశి
కన్యా రాశి వారు బృహస్పతి, చంద్రుని కలయిక వలన చాలా లాభపడతారు. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. ధన ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. పూర్వీకుల ఆస్తి వారసత్వంగా వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో అఖండ విజయం సాధిస్తారు. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ధార్మిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.