జూలై 4 నుంచి జూలై 6 వరకు చంద్రుడు తులా రాశిలో ఉంటాడు. నిన్న ఉదయం 3:18కి తులా రాశిలోకి చంద్రుడు ప్రవేశించాడు. రెండు రోజులు పాటు, అంటే జూలై 6 సాయంత్రం నాలుగు గంటల వరకు తులా రాశిలోనే ఉంటాడు. ఇది కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది.
తులా రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమ, అందం, విలాసాలను అందిస్తాడు. శుక్రుడి రాశిలోకి చంద్రుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి ఇది కలిసి వస్తుంది. మరి ఏ రాశుల వారికి తులా రాశిలో చంద్రుని ప్రవేశం శుభప్రదంగా ఉంటుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
చంద్రుడు మార్పు కూడా చాలా ముఖ్యమైనది. చంద్రుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు కొన్ని శుభయోగాలు ఏర్పడతాయి. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది, అనేక ప్రయోజనాలను కల్పిస్తుంది. సంతోషం, మానసిక ప్రశాంతత, ప్రేమ ఇలాంటివన్నీ కూడా అందుతాయి.
మకర రాశి వారికి చంద్రుని తులా రాశి సంచారం కలిసి వస్తుంది. ఈ సమయంలో మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా లాభం వస్తుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉంటారు.
కలిసి సమయాన్ని గడపడం వలన వారి ప్రేమ మరింత దృఢంగా మారుతుంది. పెళ్లి కానివారు ఇష్టపడే వారికి ఆ విషయాన్ని చెప్పడానికి ఇదే మంచి సమయం. ఈ సమయంలో ఈ రాశి వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది.
వృశ్చిక రాశి వారికి చంద్రుని సంచారం వివిధ లాభాలను కల్పిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు వారి బాస్ నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పెద్దవారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
తులా రాశిలో చంద్రుని సంచారం ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. మంచి వార్తలు అందుతాయి. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఎప్పటి నుంచో పూర్తికాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. వ్యాపారులకు హఠాత్తుగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.