మరి కొన్ని రోజుల్లో చంద్ర, కుజుడి సంయోగంతో మహాలక్ష్మీ యోగం.. మిథున రాశితో పాటు 2 రాశులకు ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో!-moon and mars conjunction forms maha lakshmi yoga on june 29th it gives lots of benefits to gemini libra and pisces ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మరి కొన్ని రోజుల్లో చంద్ర, కుజుడి సంయోగంతో మహాలక్ష్మీ యోగం.. మిథున రాశితో పాటు 2 రాశులకు ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో!

మరి కొన్ని రోజుల్లో చంద్ర, కుజుడి సంయోగంతో మహాలక్ష్మీ యోగం.. మిథున రాశితో పాటు 2 రాశులకు ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో!

Peddinti Sravya HT Telugu

జూన్ చివరిలో చంద్రుడు సింహ రాశిలోకి వెళ్తాడు. అదే సమయంలో కుజుడుతో సంయోగం చెందడం వలన విశిష్టమైన రాజయోగం ఏర్పడుతుంది. దానిని చంద్ర కుజ యోగం లేదా మహాలక్ష్మి యోగం అని అంటారు. మహాలక్ష్మి యోగం కారణంగా కొన్ని రాశుల వారికి సంపద పెరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

మరి కొన్ని రోజుల్లో చంద్ర, కుజుడి సంయోగంతో మహాలక్ష్మీ యోగం (pinterest)

గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు రాశి మార్పు చెందడం వలన అన్ని రాశుల వారిపై అది ప్రభావం చూపిస్తుంది, కానీ కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహాలక్ష్మి యోగం శుభ యోగం. చాలా రాశుల వారికి మంచి ఫలితాలను అందిస్తుంది.

చంద్రుని రాశి మార్పు

చంద్రుడు వేగంగా కదలే గ్రహం. రెండున్నర రోజులకు ఒకసారి చంద్రుడు తన రాశిని మారుస్తూ ఉంటాడు. ఈ సమయంలో పలు రాశులతో సంయోగం చెందుతాడు. ఇలా చంద్రుని రాశి మార్పు కారణంగా శుభయోగాలు ఏర్పడతాయి.జూన్ చివరిలో చంద్రుడు సింహ రాశిలోకి వెళ్తాడు. అదే సమయంలో కుజుడుతో సంయోగం చెందడం వలన విశిష్టమైన రాజయోగం ఏర్పడుతుంది.

మహాలక్ష్మి యోగం

దానిని చంద్ర కుజ యోగం లేదా మహాలక్ష్మి యోగం అని అంటారు. మహాలక్ష్మి యోగం కారణంగా కొన్ని రాశుల వారికి సంపద పెరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కేతువు కూడా సింహ రాశిలోనే ఉన్నాడు. మహాలక్ష్మి యోగం వలన ఏ రాశుల వారికి కలిసి వస్తుంది? ఎవరు అలాంటి లాభాలను పొందుతారు వంటి విషయాలను తెలుసుకుందాం.

మహాలక్ష్మి యోగం సమయం జూన్ 29 ఉదయం 6:30. మూడు గంటలకు చంద్రుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. జూలై 1 వరకు అదే రాశిలో ఉంటాడు. కుజుడు ఇప్పటికే ఆ రాశిలో ఉన్నాడు కాబట్టి 54 గంటల పాటు మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది.

మహాలక్ష్మి యోగంతో మూడు రాశుల వారికి బోలెడు లాభాలు

1.మిథున రాశి

మిథున రాశి వారికి ఈ యోగం కారణంగా అనేక శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి నమ్మకం విపరీతంగా పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తారు. తోబుట్టులతో బంధం మధురంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది.

2.మీన రాశి

మీన రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం అనేక శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలు వస్తాయి.

3.తులా రాశి

తులా రాశి వారికి మహాలక్ష్మి యోగం అనేక విధాలుగా సహాయపడుతుంది. ఆర్థికపరంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పాత అప్పులు తీరిపోతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఈ రాశి వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. బంధం మధురంగా మారుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.