సింహ రాశిలో చంద్ర-కేతువుల సంయోగం, ఈ 3 రాశుల వారి పంట పండినట్టే.. శుభవార్తలు, ఉద్యోగ ఆఫర్లు ఇలా ఎన్నో!-moon and ketu conjunction in simha rasi and 3 rasis will get lots of luck and many more ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సింహ రాశిలో చంద్ర-కేతువుల సంయోగం, ఈ 3 రాశుల వారి పంట పండినట్టే.. శుభవార్తలు, ఉద్యోగ ఆఫర్లు ఇలా ఎన్నో!

సింహ రాశిలో చంద్ర-కేతువుల సంయోగం, ఈ 3 రాశుల వారి పంట పండినట్టే.. శుభవార్తలు, ఉద్యోగ ఆఫర్లు ఇలా ఎన్నో!

Peddinti Sravya HT Telugu

చంద్ర కేతువు కలయిక సింహ రాశిలో ఏర్పడింది. సింహరాశిలో ఈ కలయిక కొన్ని రాశులకు శుభప్రదంగా, మరి కొందరికి అశుభంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి శుభవార్తలు అందుతాయి. మరి ఇది ఏయే రాశుల వారు సానుకూలం ఫలితాలను ఇస్తుంది అనేది ఇప్పుడే తెలుసుకుందాం.

సింహ రాశిలో చంద్ర-కేతువుల సంయోగం

గ్రహాలు ఎప్పటికప్పుడు తమ కదలికలను మారుస్తాయి. ప్రస్తుతం చంద్రుడు సింహ రాశిలో ఉన్నాడు, అక్కడ ఇప్పటికే కేతువు సంచరిస్తున్నారు. పంచాంగం ప్రకారం, జూన్ 1, 2025 రాత్రి 09:36 గంటలకు, చంద్రుడు సింహ రాశిలోకి ప్రవేశించాడు. జూన్ 4 వరకు చంద్రుడు ఈ రాశిలో ఉంటాడు, తరువాత కన్యా రాశికి వెళ్తాడు.

చంద్రుడు ప్రవేశించిన వెంటనే, చంద్ర కేతువు కలయిక సింహ రాశిలో ఏర్పడింది. సింహరాశిలో ఈ కలయిక కొన్ని రాశులకు శుభప్రదంగా, మరి కొందరికి అశుభంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి శుభవార్తలు అందుతాయి. మరి ఇది ఏయే రాశుల వారు సానుకూలం ఫలితాలను ఇస్తుంది అనేది ఇప్పుడే తెలుసుకుందాం.

సింహ రాశిలో చంద్ర-కేతువుల కలయిక, ఏ రాశులకు అదృష్టమంటే?

1.వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు సింహ రాశిలో చంద్ర-కేతు సంచారం వల్ల ప్రయోజనం పొందుతారు. ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో డబ్బు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో రొమాన్స్ ఉంటుంది. కెరీర్ కూడా బాగుంటుంది.

2.మీన రాశి

మీన రాశి వారికి, సింహ రాశిలో చంద్ర-కేతువు సంచారం శుభదాయకంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలు తగ్గుముఖం పడతాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. అదే సమయంలో ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది.

3.వృషభ రాశి

సింహరాశిలో చంద్రుడు, కేతువు సంచారం వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సమయం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ఆఫర్లు కూడా లభిస్తాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా నిలకడగా ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.