మిధున రాశిలో చంద్రుని సంచారంతో గురువు చంద్రుని కలయిక ఏర్పడుతుంది. ఇది గజకేసరి రాజయోగాన్ని సృష్టిస్తోంది. ఈ రాజయోగం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది, కానీ కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకువస్తుంది.
మే 28 మధ్యాహ్నం 1:36 గంటలకు చంద్రుడు వృషభ రాశి నుంచి బుధుడి రాశి అయిన మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇదే సమయంలో గురువు కూడా మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా గ్రహాల సంచార మార్పుతో గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. గజకేసరి రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టంగా మారుతుంది.
12 రాశుల వారిపై ప్రభావం పడినప్పటికీ, కొన్ని రాశుల వారికి మాత్రమే విపరీతమైన లాభాలను తీసుకువస్తుంది. మరి గజకేసరి రాజయోగంతో ఏ ఏ రాశుల వారు ప్రయోజనాన్ని పొందుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
చంద్రుడు మిధున రాశిలోకి ప్రవేశించడం, అదే విధంగా గురువు కూడా మిధున రాశిలో సంచారం చేయడం వలన చంద్రుడు–గురువు కలయిక కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఈ మూడు రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా విపరీతమైన అదృష్టం కలుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎన్నో లాభాలను కూడా పొందుతారు.
మిధున రాశి వారికి గజకేసరి రాజయోగం అనేక విధాలుగా సహాయపడుతుంది, అదృష్టాన్ని అందిస్తుంది. ఈ సమయంలో వారిపై వారికి నమ్మకం కూడా కలుగుతుంది. శుభవార్తలు వింటారు. ఎప్పటి నుంచో ఉన్న కష్టాలన్నీ కూడా ఈ సమయంలో తీరిపోతాయి. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఈ సమయంలో విజయాలను అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.
సింహ రాశి వారికి గజకేసరి రాజయోగం ఎన్నో లాభాలను ఇస్తుంది. ఈ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. ఆదాయంలో కూడా ఎంతో మార్పు వస్తుంది. సక్సెస్‌ను కూడా అందుకుంటారు. వ్యాపారులకు కూడా గజకేసరి రాజయోగంతో అనేక లాభాలు ఉంటాయి. పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు వస్తాయి. ఇలా గజకేసరి రాజ యోగంతో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.
కుంభ రాశి వారికి గజకేసరి రాజయోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఊహించని విధంగా ఆర్థిక లాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంపాదన కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు వచ్చి ఆర్థిక లాభాన్ని పొందుతారు. ఈ రాశి వారు పిల్లల నుండి కూడా శుభవార్తలు వింటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.