Moodam: ఈరోజు నుంచి మూఢం.. ఈ 11 రోజులు పెళ్ళిళ్ళు జరపకూడదు.. ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోండి-moodam for 11 days marriages must not done during these days check what to do and what we should not do ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Moodam: ఈరోజు నుంచి మూఢం.. ఈ 11 రోజులు పెళ్ళిళ్ళు జరపకూడదు.. ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోండి

Moodam: ఈరోజు నుంచి మూఢం.. ఈ 11 రోజులు పెళ్ళిళ్ళు జరపకూడదు.. ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోండి

Peddinti Sravya HT Telugu

Moodam: మూఢం వచ్చినప్పుడు అన్ని పనుల్ని కూడా మానేస్తారు. ఎలాంటి శుభకార్యాలు చేయరు. మార్చిలో మూఢం ఎప్పుడు మొదలవుతుంది? ఎందుకు మూఢం వస్తుంది, ఈ సమయంలో ఎందుకు శుభకార్యాలు చేయకూడదు? వంటివి తెలుసుకుందాం.

ఈరోజు నుంచి మూఢం (pinterest)

ఈరోజు నుంచి మూఢం మొదలవుతుంది. శుక్ర మూఢం సమయంలో కొన్ని పనులు చేయకూడదు. శుక్ర మూఢం సమయంలో ఎటువంటి వాటిని చేయకూడదు?, వాటి వలన ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? ఇటువంటి విషయాలని వివరంగా తెలుసుకుందాం. మూఢం వచ్చినప్పుడు అన్ని పనుల్ని కూడా మానేస్తారు. ఎలాంటి శుభకార్యాలు చేయరు.

ఈ విషయాన్ని మీరు కూడా చాలాసార్లు విని ఉంటారు. మూఢం అంటే ఏంటి? మూఢం సమయంలో ఎటువంటి పనులు చేయకూడదు? ఎటువంటిది చేస్తే మంచి జరుగుతుంది ఇలాంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

మూఢం అంటే ఏంటి?

మూఢం అంటే శుభకార్యాలు చేయడానికి వీలులేని రోజులు. ఏ పని చేయకుండా పనికిరాని కాలంగా, విడిచిపెట్టే కాలంగా దీనిని భావిస్తారు. హిందువులు గ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గ్రహస్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయరు. దీనిని చెడుకాలం అని కూడా చెప్పొచ్చు.

మార్చిలో మూఢం ఎప్పుడు మొదలవుతుంది?

మార్చి 18 నుంచి 28 వరకు శుక్ర మూఢం.11 రోజుల పాటు మంచి రోజులు కావు. మూఢం సమయంలో శుభకార్యాలు చేయకూడదు. కొన్ని తప్పులు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు.

ఎందుకు మూఢం వస్తుంది, ఈ సమయంలో ఎందుకు శుభకార్యాలు చేయకూడదు?

మూఢం అనేది రెండు రకాలు. ఒకటి గురు మూఢం, ఇంకొకటి శుక్ర మూఢం అని అంటారు. ఇక ఇప్పుడు వచ్చేది శుక్ర మూఢం. మార్చి 18 నుంచి 28 వరకు ఉంటుంది. అంటే సుమారు 11 రోజులు. జూన్ 10వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు గురు మూఢం ఉంది.

ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ మూఢం రోజుల్లో శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మూఢం సమయంలో శుభకార్యాలు చేస్తే ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు.

ఈ సమయంలో శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఎప్పుడూ కూడా గురు బలం, శుక్ర బలం ఉంటేనే జరుపుతారు. ఈ మూఢం సమయంలో గురు గ్రహానికి శుక్ర గ్రహానికి తక్కువ శక్తి ఉంటుంది. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు. అందుకే దీనిని మూఢం అని అంటారు.

మూఢం సమయంలో ఏం చేయకూడదు?

  1. మూఢం సమయంలో పెళ్లిచూపులు నిర్వహించడం వంటివి చేయకూడదు.
  2. పెళ్లిళ్లు కూడా ఈ సమయంలో జరపకూడదు. ఒకవేళ పెళ్లిళ్లు జరిపిస్తే కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు. గొడవలు పడుతూ ఉంటారు. విడిపోయే అవకాశాలు ఉన్నాయి.
  3. శుభకార్యాలని ఈ మూఢం సమయంలో ప్రారంభించకూడదు. అలా చేస్తే చెడు జరిగే ప్రమాదం ఉంది.
  4. లగ్న పత్రికలు రాసుకోకూడదు. పెళ్లి పత్రికల జోలికే వెళ్ళకూడదు.
  5. మూఢం సమయంలో పెళ్లి మాటలు మాట్లాడటం కూడా తప్పు.
  6. పసి పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు. కొత్త వ్యాపారాలని మొదలుపెట్టకూడదు. పుట్టు వెంట్రుకలు ఈ సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
  7. చెవులు కుట్టించకూడదు.
  8. కొత్త వాహనాలు కొనుగోలు చేయడం, శంకుస్థాపన చేయడం వంటివి కూడా చేయకూడదు.
  9. ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం, సొంత ఇంటికి వెళ్లిపోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయి. దేవుడికి మొక్కలు చెల్లించుకోవడం కూడా ఈ మూఢం సమయంలో చేయకూడదు.
  10. వ్రతాలు చేయడం, విగ్రహ ప్రతిష్టాపనలు లాంటివి కూడా చేయకూడదు.
  11. ఈ మూఢం సమయంలో వైభవంగా పుట్టిన రోజులు చేయకూడదు.
  12. చెరువులు తవ్వడం, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది.

మూఢం సమయంలో ఏం చేయవచ్చు?

  1. చిన్న పిల్లలకు అన్నప్రసన చెయ్యచ్చు.
  2. దూర ప్రయాణాలు చెయ్యచ్చు.
  3. ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా చేయించుకోవచ్చు.
  4. భూముల అమ్మడం, భూములు కొనడం వంటివి చేయొచ్చు.
  5. అగ్రిమెంట్లు రాసుకోవడంలో తప్పులేదు.
  6. రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం లాంటివి కూడా చేయొచ్చు.
  7. విదేశాలకు వెళ్లడం, కొత్త ఉద్యోగంలో చేరడం వంటివి చేయొచ్చు. కొత్త బట్టల్ని కొనుగోలు చేయొచ్చు. ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లొచ్చు. దేవాలయాల్లో అన్నదానాలు చేయడం, సీమంతం వేడుకలు చేసుకోవడం, దైవ కార్యాలను నిర్వహించడం చేయొచ్చు.
  8. నవగ్రహ శాంతులు, హోమాలు కూడా చేయించుకోవచ్చు.
  9. మూఢం సమయంలో బాలింతలు, గర్భిణీలు ప్రయాణం చేయడం మంచిది కాదు. ఒకవేళ చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయొచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail

సంబంధిత కథనం