Mokshada Ekadashi 2024:ఏకాదశి నాడు తులసిమొక్కకు నీరు పోయకూడదని చెబుతారు, ఎందుకు?
Mokshada Ekadashi 2024: డిసెంబర్ 11న మోక్షద ఏకాదశి జరుపుకుంటారు. మార్గశీర్ష మాసంలో శుక్లపక్ష ఏకాదశి తిధిని మోక్షద ఏకాదశి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
మార్గశీర్ష మాసంలో శుక్లపక్ష ఏకాదశి తిధిని మోక్షద ఏకాదశి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఏకాదశి తిథి డిసెంబర్ 11, 2024 తెల్లవారుజామున 03:42 గంటలకు ప్రారంభమై, 2024 డిసెంబర్ 12 ఉదయం 01:09 గంటలకు ముగుస్తుంది. పరాణ సమయం డిసెంబర్ 12, 2024 ఉదయం 07:04 నుండి 09:08 గంటల వరకు ఉంటుంది. డిసెంబర్ 12, 2024, రాత్రి 10:26 గంటలకు ముగుస్తుంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
ప్రాముఖ్యత, ఆచారాలు:
మోక్షద ఏకాదశిలో 'మోక్షద' అనే పదానికి ముక్తి అని అర్థం, ఇది ఈ ఏకాదశిని ఆధ్యాత్మికంగా సూచిస్తుంది. ఈ ఏకాదశి నాడు విష్ణువుని, తులసిని పూజించడం వల్ల భక్తులు పునర్జన్మ చక్రం నుండి తప్పుకుంటారని నమ్ముతారు. ఈ రోజున భక్తులు ఉపవాసం చేస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం పాటించడం వల్ల అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయి. విష్ణుమూర్తిని ప్రార్థించి తులసి ఆకులు, పూలు, దీపాలు సమర్పిస్తారు. విష్ణు సహస్రనామం వంటి మంత్రాలను పఠిస్తారు. కొందరు భగవద్గీతను కూడా చదువుతారు.
తులసి మొక్కని ఆరాధిస్తే విశేష ఫలితాలని అందుకోవచ్చు:
మోక్షద ఏకాదశి నాడు తులసిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. మోక్షద ఏకాదశి నాడు తులసి మొక్కకి నీరు పోయకూడదు. మోక్షద ఏకాదశి నాడు ఆర్థిక లాభాలను పొందడానికి తులసి మొక్కలో ఒక నాణాన్ని పాతిపెట్టాలి. తర్వాత తులసి మాతను నమస్కరించుకోవాలి.
ఇలా చేయడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. మోక్షద ఏకాదశి నాడు తులసి కోట ఎదుట నెయ్యి దీపం వెలిగిస్తే మంచిది. అలాగే తులసి మొక్కకు 21సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఇలా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కొచ్చు. శ్రీకృష్ణ భగవానుడికి మోక్షద ఏకాదశి చాలా ఇష్టం. ఈరోజు నా చాలామంది భక్తులు ఉపవాసం చేస్తారు. అలాగే తులసి మాతను పూజిస్తారు. ఇలా చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు.
ఏకాదశి నాడు తులసిమొక్కకు నీరు పోయకూడదని చెబుతారు, ఎందుకు?
హిందూ సంప్రదాయం ప్రకారం చూసినట్లయితే, లక్ష్మీదేవి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. ఏకాదశి నాడు తులసికి నీటిని సమర్పించడం వలన ఆమె ఉపవాసానికి భంగం కలుగుతుంది. దీంతో లక్ష్మీదేవికి కోపం వచ్చి, ఎండిపోవడం మొదలవుతుంది అని పురాణాల ద్వారా చెప్పబడింది. కాబట్టి మోక్షద ఏకాదశి నాడు కూడా తులసి మొక్కకు నీరు పోయకూడదు.
సంబంధిత కథనం