చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా విశ్వావసు నామ సంవత్సరం మిథున రాశి ఫలితములు..
బృహస్పతి (గురుడు) ఈ సంవత్సరం ఉగాది నుండి 14.5.25 వరకు వృషభంలో ఉంటాడు. దీంతో ఋణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం.
15.5.25 నుండి 19.10.25 వరకు, తిరిగి 6.12.25 నుండి సంవత్సరం చివర వరకు మిథునంలో ఉంటాడు. వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకో కుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడుట మంచిది.
20.10.25 నుండి 5.12.25 వరకు కర్కాటకంలో ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగు తుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివర వరకు శని మీనంలో ఉంటాడు. ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులు అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు.
రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు మీనంలో ఉంటాడు. మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
19.5.25 నుండి సంవత్సరం చివర వరకు కుంభంలో ఉంటాడు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలెక్కువ చేస్తారు.
కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు కన్యలో ఉంటాడు. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. కొన్నికార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
19.5.25 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్త పడుట మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకా లెదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
సోదర వైరం కలిగే అవకాశముంటుంది. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి ఆలయాలను దర్శించడం, అభిషేకం వంటివి చేసుకోవటం మంచిది. శనగలను నైవేద్యంగా చేసి ఆలయములలో పంచి పెట్టండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.
ఈ మాసంలో మీకు అనుకూల ఫలితాలున్నాయి. కోర్టు వ్యవహారములు అనుకూలించును. ఉద్యోగపరంగా అనుకూలం. పెద్దవారితో పరిచయాలుంటాయి. గృహ ప్రయత్నములు చేస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకం. అపవాదులు వచ్చును.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలుంటాయి. కుటుంబ గొడవలతో మనస్తాపం చెందుతారు. భార్య వలన సౌఖ్యం ఉంటుంది. ఇంట్లో శుభ కార్యములు చేస్తారు. ఆలయ దర్శనం చేస్తారు. కారణం లేకనే విరోధములు ఏర్పడును.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కొత్త వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కష్టపడితే కాని పనులు పూర్తికావు. వృత్తిపరంగా అనుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కులుంటాయి. వాహన ప్రమాదాలు ఉండొచ్చు. కొత్త వస్తువులు కొంటారు. ఉద్యోగ లాభాలు ఉంటాయి.
ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితములు ఉన్నాయి. కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలసి తీర్థయాత్రలు చేస్తారు. అపజయములుంటాయి. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. మీరు ఇతరులకు సహాయపడతారు. ఖర్చులుంటాయి.
ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. గృహ ప్రయత్నములు ఫలిస్తాయి. కొత్తవారితో పరిచయాలేర్పడతాయి. సంఘంలో మంచి గౌరవం లభించును. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. స్త్రీ మూలకంగా ధన యోగం ఏర్పడుతుంది.
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వస్త్రములు, ఆభరణములు కొనుగోలు చేసెదరు. ప్రయత్నించిన కార్యములు ఫలించును. కలహములు ఏర్పడును. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉండును. అప్పులు చేయుదురు.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అధిక ధనవ్యయముండును. విరోధములు, అపవాదులు అధికం. స్త్రీ సౌఖ్యము. ప్రయాణములో చోరభయములు. ఇతరుల గూర్చి ఆలోచిస్తారు. మనోవిచారములు. వ్యాపారం గూర్చి ఆలోచనలు పెరుగును.
ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. గృహ నిర్మాణమునకు ఆటంకములు ఉంటాయి. అనుకోని ఖర్చులుంటాయి. సోదర సఖ్యత. వస్త్ర లాభముంటుంది. భూమి కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సహకారముంటుంది. ప్రమాద సూచనలున్నాయి. వృధా ఖర్చులుంటాయి.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. విలువైన వస్తువులు కొంటారు. కుటుంబ కలహాలుంటాయి. శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. నూతన స్నేహము ఏర్పడుతుంది. స్త్రీమూలక ధననష్టములు, దూరపు ప్రయాణాలుంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి.
ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. మానసిక ఆందోళన, భయం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రతి విషయంలో వ్యతిరేకంగా ఉంటారు. మాసం చివరలో ప్రమోషన్లుంటాయి. స్త్రీమూలక ధననష్టములుంటాయి.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధువర్గంతో విరోధములుంటాయి. శుభకార్యాలు కలసి వచ్చును. స్నేహితులను కలుసుకుంటారు. విదేశీ యోగమున్నది. పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఆర్థికముగా అనుకూలం.
ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. విపరీతమైన ఖర్చులుంటాయి. శుభవార్తలు వింటారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. చీటీలు కలసివచ్చును. దేవాలయ దర్శనం చేస్తారు.
సంబంధిత కథనం