Mithuna Rasi Today: మిథున రాశి వారు ఈరోజు అనవసర విషయాలకి దూరంగా ఉండాలి, ఒక గుడ్ న్యూస్ వింటారు-mithuna rasi phalalu today 29th august 2024 check your gemini zodiac sign horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mithuna Rasi Today: మిథున రాశి వారు ఈరోజు అనవసర విషయాలకి దూరంగా ఉండాలి, ఒక గుడ్ న్యూస్ వింటారు

Mithuna Rasi Today: మిథున రాశి వారు ఈరోజు అనవసర విషయాలకి దూరంగా ఉండాలి, ఒక గుడ్ న్యూస్ వింటారు

Galeti Rajendra HT Telugu
Aug 29, 2024 04:53 AM IST

Gemini Horoscope Today: రాశిచక్రంలో 3వ రాశి మిథున రాశి. పుట్టిన సమయంలో మిథున రాశిలో సంచరించే జాతకుల రాశిని మిథున రాశిగా పరిగణిస్తారు. ఈరోజు మిథున రాశి వారి ప్రేమ, ఆర్థిక, కెరీర్, ఆరోగ్య జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

మిథున రాశి
మిథున రాశి

Mithuna Rasi Phalalu 29th August 2024:  మిథున రాశి వారి ప్రేమ జీవితం ఈరోజు రొమాన్స్‌తో సరదాగా నిండి ఉంటుంది. పనికి సంబంధించిన కొత్త పాత్ర లేదా స్థానంపై దృష్టి పెట్టండి. ఇది మీ నైపుణ్యాలను నిరూపించడంలో మీకు సహాయపడుతుంది. డబ్బు పరంగా మీ పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్యా ఈరోజు  మీకు రాదు. 

ప్రేమ

ఈరోజు మిథున రాశి వారు వ్యక్తిగత విజయం లేదా వృత్తిపరమైన విజయం సాధిస్తే అందుకు సహాయపడిన మీ భాగస్వామిని మీరు  ప్రశంసించాలి. బేషరతుగా మీ ప్రేమను చూపించండి. మీ భాగస్వామి ఈరోజు ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. సంభాషణ సమయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. 

మీ భాగస్వామిని ఇబ్బంది పెట్టే అనవసరమైన విషయాలపై మాట్లాడటం మానుకోండి. గత సమస్యలను కూడా పరిష్కరించడానికి మీరు చొరవ చూపండి. తల్లిదండ్రుల ఆమోదం పొందడానికి, మీ భాగస్వామిని ఈ రోజు కుటుంబానికి పరిచయం చేయండి. పెళ్లి గురించి కూడా మాట్లాడుకోవచ్చు. కొంతమంది జాతకులు ఈ రోజు రొమాంటిక్ డిన్నర్‌కు కూడా వెళ్లొచ్చు.

కెరీర్ 

పని పరంగా ఈరోజు మిథున రాశి వారికి ఉత్సాహం నిండి ఉంటుంది.  కొత్త పనులు చేయాలనే మీ శ్రద్ధని చూపించండి. ఇది మిమ్మల్ని రోజంతా బిజీగా ఉంచుతుంది. టీమ్ మీటింగ్‌లలో సృజనాత్మకం ఉండండి. మీ ఆలోచన లేదా ఏదైనా ప్రాజెక్ట్ ఆమోదం పొందే అవకాశం ఉంది. 

ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి. మీరు వ్యాపారంలో ఉంటే, వ్యాపారాన్ని విస్తరించడానికి, కొత్త పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. కొంతమంది అదృష్టవంతులు విదేశాలలో తమ వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తారు. పోటీలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి.

ఆర్థిక 

ఈ రోజు పాత పెట్టుబడులతో సహా అనేక మార్గాల నుండి డబ్బు పొందే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించిన అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా నిర్వహించండి. దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికలు ఈ రోజు మంచి ఎంపికలుగా మారుతాయి. రియల్ ఎస్టేట్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లుగా ఎంచుకోవచ్చు. కొంతమంది మహిళా జాతకులు స్నేహితుడితో ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. కొంతమంది మిథున రాశి వారికి విదేశాలలో చదివే పిల్లల అవసరాలను తీర్చడానికి డబ్బు అవసరం అవుతుంది. 

ఆరోగ్యం

ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి . కొంతమంది ఎముకలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకసారి  వైద్యుడితో చెక్ చేయించుకోవాల్సిన అవసరం రావొచ్చు.  వైరల్ ఫీవర్, గొంతునొప్పి, జీర్ణ సమస్యలు కూడా కొందరికి రావచ్చు. గర్భిణీ మిథున రాశి స్త్రీలు మద్యానికి దూరంగా ఉండాలి, సాహస క్రీడలలో పాల్గొనకూడదు.