Mithuna Rashi Today: మిథున రాశి వారి జీవితంలోకి ఈరోజు మాజీ లవర్ పునరాగమనం, జాగ్రత్త అవసరం-mithuna rashi phalalu august 17 2024 in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mithuna Rashi Today: మిథున రాశి వారి జీవితంలోకి ఈరోజు మాజీ లవర్ పునరాగమనం, జాగ్రత్త అవసరం

Mithuna Rashi Today: మిథున రాశి వారి జీవితంలోకి ఈరోజు మాజీ లవర్ పునరాగమనం, జాగ్రత్త అవసరం

Galeti Rajendra HT Telugu
Aug 17, 2024 05:41 AM IST

Gemini Horoscope Today: మిథున రాశి వారికి ఈరోజు సాయంత్రానికి డబ్బు చేతికి అందుతుంది. కొత్త వాహనం లేదా ఇల్లును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఖర్చు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం.

మిథున రాశి
మిథున రాశి

Mithuna Rashi August 17, 2024: మిథున రాశి వారికి ఈరోజు ధన ప్రవాహం పెరుగుతుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ రోజు మీ ప్రేమ జీవితంలోని కొన్ని సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. భాగస్వామితో ప్రేమ, అనుబంధం పెరుగుతాయి. వృత్తి జీవితంలో కొత్త విజయాలు సాధిస్తారు.

ప్రేమ

మిథున రాశి వారు ఈరోజు మీ బంధానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. కొంతమంది మహిళల జీవితంలో మాజీ ప్రేమికుడి పునరాగమనం ఉండవచ్చు. ఇది వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 

ఈ రోజు మనసు విప్పి మాట్లాడటం ద్వారా మీ భాగస్వామితో భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నించండి. సంబంధాల్లో ప్రేమ, అనుబంధం పెరుగుతాయి. మీరు మీ భాగస్వామితో విహారయాత్రను ప్లాన్ చేయవచ్చు. వివాహితులు తమ జీవిత భాగస్వామితో గత సంబంధం గురించి చర్చించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

కెరీర్

ఆఫీసు సమావేశాల్లో మీ అభిప్రాయాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పనుల విషయంలో అస్సలు అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు ఔత్సాహికులు నూతన వ్యాపారాలు ప్రారంభించడంలో విజయం సాధిస్తారు. ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్లు, బేకరీలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వారికి చిన్నచిన్న సమస్యలు ఎదురవుతాయి. 

ఈ రోజు వృత్తి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. కొత్త పనులకు బాధ్యతలు స్వీకరిస్తారు. మీరు కార్యాలయంలో అదనపు సమయం గడపవలసి ఉంటుంది. మేనేజర్లు, టీమ్ లీడర్లు కొత్త ఆలోచనలతో అన్ని పనులు చేయాల్సి ఉంటుంది.

ఆర్థికం

కొంతమందికి పూర్వీకుల ఆస్తి కూడా లభిస్తుంది. కొంతమంది జాతకులు సాయంత్రానికల్లా కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తారు. 

రోజు ప్రారంభంలో ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కానీ సాయంత్రానికి మీరు చాలా డబ్బు సంపాదిస్తారు. వ్యక్తిగత జీవితం, అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోండి. పలు ప్రాంతాల నుంచి వ్యాపారులకు నిధులు అందుతాయి.  

ఆరోగ్యం: బస్సు లేదా రైలు ఎక్కేటప్పుడు. దిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్, స్పైసీ ఫుడ్ తీసుకోవడం మానుకోండి. బీపీ ఉన్న వాళ్లు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పనుల్లో ఎక్కువ ఒత్తిడికి లోనుకావద్దు. ఇది తలనొప్పికి కారణమవుతుంది.