చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు నియమాలని పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. దీంతో సంతోషం, ప్రశాంతత ఉంటాయి. ఇది ఇలా ఉంటే ప్రతీ ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మన ఇంట్లో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి.
చాలా మంది ఇంట్లో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటి వలన ఎన్నో నష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో అద్దం పెట్టడానికి కూడా ప్రత్యేక దిశ ఉంటుంది. ఇంట్లో అద్దం ఏ వైపు పెట్టకూడదు అనేది తెలుసుకుని దాని ప్రకారం పాటించాలి. లేకపోతే దురదృష్టం కలుగుతుంది. ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అద్దం ఏ దిశలో ఉంటే మంచిది?, ఏ దిశలో ఉంటే సానుకూల శక్తి ప్రవహిస్తుంది? పొరపాట్లు జరగకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో ఉంచే అద్దం ఎప్పుడూ కూడా దక్షిణం వైపు ఉండకూడదు. ఇది యమధర్మరాజు దిశ. ఇటువైపు అద్దం ఉండడం వలన యమధర్మరాజు యమదూతల్ని పంపిస్తారట. పైగా ఇది చెడుని తీసుకువస్తుంది. కాబట్టి, ఎప్పుడూ కూడా అద్దాన్ని ఈ దిశలో ఉంచకండి.
జ్యోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, దక్షిణం వైపు అద్దం ఉంటే కెరియర్ లో ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది .
దక్షిణం వైపు అద్దం ఉండడం వలన ప్రతికూల శక్తి కలుగుతుంది. ఈ కారణంగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. సోదరుల బంధం కూడా చెడిపోతుంది.
దక్షిణం వైపు అద్దం ఉండడం వలన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి కూడా బాధపడుతుంది. దీంతో ఇంట్లో ధనం ఉండదు. ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం