Mercury transit: తులా రాశిలోకి గ్రహాల రాకుమారుడు- వీరికి శత్రువుల చేతిలో ఓటమి, వ్యాపారంలో నష్టాలు
Mercury transit: గ్రహాల రాకుమారుడు బుధుడు కన్యా రాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి శుభ, మరికొందరికి అశుభ ఫలితాలు ఎదురవుతాయి. ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.
గ్రహాల రాకుమారుడైన బుధ గ్రహం రాశి మారుతోంది. నవరాత్రి పక్షంలో బుధుడు కన్యా రాశి నుండి తులా రాశిలోకి వెళుతున్నాడు. ఇప్పటి వరకు కన్యా రాశిలో బుధునితో పాటు మరో మూడు గ్రహాలు ఉండి చతుర్గ్రాహి యోగం ఏర్పడింది.
అక్టోబర్ 10న బుధుడు కన్యా రాశిలోకి వెళతాడు. అక్టోబరు 10, 2024 ఉదయం 11:25 గంటలకు తులా రాశిలో బుధుడి సంచారం అనేక రాశులను ప్రభావితం చేస్తుంది. బుధుడు మేధస్సు, తర్కం, స్నేహితులు, ప్రసంగం, వ్యాపారం, కమ్యూనికేషన్‌తో సంబంధం కలిగి ఉంటాడు. బుధుడు మిథున రాశి, కన్యా రాశికి అధిపతి.
తులా రాశిలోని బుధుడు, వ్యాపార వ్యవహారాలకు అనుకూలమైన సంకేతంగా భావిస్తారు. ఈ సమయంలో వ్యాపారం చేసే వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. వృత్తి జీవితంలో మెరుగైన వృద్ధి సాధిస్తారు. నవరాత్రులలో బుధుడు తులా రాశిలోకి వెళ్లడం వల్ల ఏ రాశులు ప్రభావితం అవుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
మేష రాశి
బుధుడు రాశి మార్పు ప్రభావం మేష రాశిపై ప్రభావం చూపుతుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. మేష రాశి వ్యక్తులు ఈ సమయంలో ప్రయోజనాలను పొందలేరు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మీకు ప్రయోజనాల సంకేతాలు ఉన్నాయి. మీరు కోల్పోయిన అవకాశాలు మళ్లీ మీ ముందుకు రావచ్చు. మొత్తం మీద ఇది మీకు ఆర్థిక పురోగతి సమయం. పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
సింహ రాశి
సింహ రాశి వాళ్ళకు ఇది వ్యక్తిగత వృద్ధి సమయం. మీరు ఆర్థిక రంగంలో పెద్ద ప్రయోజనాలను పొందుతారు. అలాంటి అనేక అవకాశాలు మీ కోసం వస్తున్నాయి. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఏదైనా పాత పెట్టుబడి మీకు లాభాన్ని ఇస్తుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ సమయం కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. ఈ పరిస్థితుల వల్ల పనిలో వైఫల్యాన్ని ఎదుర్కోవచ్చు. కానీ ఈ వైఫల్యం కొంతకాలం మాత్రమే ఉంటుంది. తర్వాత సమయం అంతా బాగుంటుంది. వృషభ రాశి వాళ్ళకు కెరీర్ పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ప్రమోషన్లు, ప్రోత్సాహకాలు సకాలంలో అందకపోవచ్చు. దీని వల్ల నిరాశకు గురవుతారు. వ్యాపారపరంగా తగినంత డబ్బు సంపాదించలేరు. శత్రువుల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సార్లు ఓటమి చవిచూడాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో పాటు అప్పుల పాలవుతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి తాత్కాలిక ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకూడదు. కొంత సమయం పాటు వాయిదా వేయండి. కెరీర్ లో అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోవచ్చు. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఒత్తిడి కారణంగా పనిలో తప్పులు దొర్లుతాయి. వ్యాపారస్తులు డబ్బులు నష్టపోతారు.
ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.