Lakshmi narayana yogam: ఏడాది తర్వాత కర్కాటక రాశిలో లక్ష్మీ నారాయణ యోగం.. ఈ రాశులకు వరం-mercury venus conjunction in karkata rashi will create lakshmi narayana yogam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lakshmi Narayana Yogam: ఏడాది తర్వాత కర్కాటక రాశిలో లక్ష్మీ నారాయణ యోగం.. ఈ రాశులకు వరం

Lakshmi narayana yogam: ఏడాది తర్వాత కర్కాటక రాశిలో లక్ష్మీ నారాయణ యోగం.. ఈ రాశులకు వరం

Gunti Soundarya HT Telugu
Jun 27, 2024 07:00 PM IST

Lakshmi narayana yogam: కర్కాటక రాశిలో బుధుడు, శుక్ర గ్రహాల కలయిక జరగబోతుంది. దీని వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. దాదాపు సంవత్సరం తర్వాత ఈ యోగం కర్కాటక రాశిలో వస్తుంది.

లక్ష్మీ నారాయణ యోగం
లక్ష్మీ నారాయణ యోగం

Lakshmi narayana yogam: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట విరామం తర్వాత గ్రహాలు, నక్షత్రరాశులను మారుస్తాయి. కొన్నిసార్లు గ్రహాల అద్భుతమైన కలయిక వల్ల బుధాదిత్య, శుక్రాదిత్య, ధన లక్ష్మి, లక్ష్మీ నారాయణ యోగంతో సహా అనేక రాజయోగాలను సృష్టిస్తుంది.

yearly horoscope entry point

జాతకంలో ఈ రాజయోగాలు ఏర్పడటం చాలా శుభప్రదంగా, ఫలప్రదంగా పరిగణిస్తారు. ఇది జీవితంలోని అన్ని సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం గ్రహాల రాకుమారుడైన బుధుడు కర్కాటక రాశిలోకి జూన్ 29, 2024 మధ్యాహ్నం 12:29 గంటలకు ప్రవేశిస్తాడు. అటు శుక్రుడు కూడ జూలై 7 తెల్లవారుజామున 04:39 గంటలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కూడా కర్కాటకరాశిలోకి ప్రవేశించడంతో రాజయోగం ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు దగ్గరగా రావడం వల్ల కర్కాటక రాశిలో ఏడాది తర్వాత లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడబోతుంది. దీని ప్రభావం పదిహేను రోజుల పాటు ఉంటుంది. బుధుడు పదిహేను రోజుల తర్వాత మళ్ళీ రాశిని మార్చి సింహ రాశి ప్రవేశం చేస్తాడు. బుధ, శుక్రుడి శుభ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు చాలా శుభ ఫలితాలను పొందుతారు. దీంతో ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంపద ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. భౌతిక సుఖాలు పెరుగుతాయి. లక్ష్మీ నారాయణ యోగం వల్ల ఏ రాశుల వారు ధనవంతులు అవుతారో తెలుసుకుందాం.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడడం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ శుభప్రదమైన రాజయోగం ఈ రాశిలోనే ఏర్పడుతుంది. ఈ సమయంలో మీ కలలన్నీ నెరవేరుతాయి. మీరు మీ కెరీర్‌లో గొప్ప విజయాన్ని సాధిస్తారు. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యమైన పనులకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. సంబంధాలు మెరుగుపడతాయి. అన్నదమ్ములతో సత్సంబంధాలు బాగుంటాయి. ఈ సమయంలో మీరు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

తులా రాశి

లక్ష్మీ నారాయణ యోగం తులా రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. సంపద పెరిగే అవకాశం ఉంటుంది. మీరు వృత్తికి సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. కెరీర్‌లో ఎదుగుదలకు అనేక అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన, ధాన్యాల నిల్వ నిండుగా ఉంటుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి బుధ, శుక్రుల కలయిక వల్ల వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఆర్థిక కోణం బలంగా ఉంటుంది. భూమి, ఆస్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త పెట్టుబడి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు విద్యా పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు.

Whats_app_banner