Mercury Transit: మే నెలలో బుధుడు రెండుసార్లు సంచరించడంతో.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు!-mercury transit twice in may month and these 3 rasis will gets lots of wealth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Transit: మే నెలలో బుధుడు రెండుసార్లు సంచరించడంతో.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు!

Mercury Transit: మే నెలలో బుధుడు రెండుసార్లు సంచరించడంతో.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు!

Peddinti Sravya HT Telugu

Mercury Transit: బుధుడు మే 7న మేషరాశిలో సంచరిస్తాడు. మే 23న మేషరాశిని వదిలిపెట్టి వృషభ రాశిలో సంచరిస్తాడు. ఇలా మే నెలలో రెండు సార్లు బుధుడు రాశి మార్పు కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

బుధుడి సంచారం

మే నెలలో బుధుడు రాశిని రెండుసార్లు మారుస్తాడు. సంపద, వ్యాపారం, వాక్కు, తెలివితేటలు అందించే బుధుడు రెండుసార్లు సంచరించడం వలన నాలుగు రాశుల వారికి ప్రయోజనం కలగనుంది. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి.

బుధుడు మే 7న మేషరాశిలో సంచరిస్తాడు. మే 23న మేషరాశిని వదిలిపెట్టి వృషభ రాశిలో సంచరిస్తాడు. ఇలా మే నెలలో రెండు సార్లు బుధుడు రాశి మార్పు కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

మే నెలలో బుధుడి రాశుల మార్పుతో ఈ 3 రాశులకు కలిసి వస్తుంది

1.మేష రాశి

మేష రాశి వారికి బుధుడు రాశుల మార్పు కారణంగా రెండుసార్లు ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశుల వారికి సాడే సతి వలన వచ్చే నష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది. నెల ద్వితీయార్థం బాగుంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. తెలివిగా పెట్టుబడి పెడితే ప్రయోజనం ఉంటుంది. బుధుడు శుభస్థానంలో ఉన్నట్లయితే ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

2.వృషభ రాశి

వృషభ రాశి వారికి బుధుడు రాశుల మార్పు వలన పలు ప్రయోజనాలు వున్నాయి. ఏ రాశి వారికి సానుకూల ఫలితం ఉంటుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. పదోన్నతి, కోరుకున్న స్థానం, డబ్బు కలుగుతాయి. కెరియర్ లో కూడా ఎదుగుదల ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వివాహం జరగవచ్చు.

3.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రాశుల మార్పుల వలన పలు ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది. కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి కూడా ఇది మంచి సమయం.

4.కుంభ రాశి

కుంభ రాశి వారికి బుధుడు రెండుసార్లు రాశి మార్పుతో కొన్ని లాభాలు ఉంటాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. జీతం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail

సంబంధిత కథనం