జూన్ నెలలో రెండు సార్లు బుధుడి సంచారం.. మూడు రాశులకు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు.. ఆ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా?-mercury transit twice in june month in gemini cancer 3 zodiacs will get lots of benefits including wealth promotions ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూన్ నెలలో రెండు సార్లు బుధుడి సంచారం.. మూడు రాశులకు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు.. ఆ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా?

జూన్ నెలలో రెండు సార్లు బుధుడి సంచారం.. మూడు రాశులకు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు.. ఆ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా?

Peddinti Sravya HT Telugu

బుధుడి రాశి మార్పుతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. బుధుడు జ్ఞానాన్ని అందిస్తాడు. బుధుడు జూన్ నెలలో మిధున, కర్కాటక రాశుల్లోకి ప్రవేశిస్తాడు. ఇది కొన్ని రాశుల వారి వృత్తి, వ్యాపారం పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. మూడు రాశులకు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు అందుతాయి.

జూన్ నెలలో రెండు సార్లు బుధుడి సంచారం

వేద జ్యోతిష్యం ప్రకారం జూన్ నెలలో బుధుడి సంచారం ఉంటుంది. బుధుడు రాశి మార్పుతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. బుధుడు జ్ఞానాన్ని అందిస్తాడు. బుధుడు జూన్ నెలలో మిధున, కర్కాటక రాశుల్లోకి ప్రవేశిస్తాడు. ఇది కొన్ని రాశుల వారి వృత్తి, వ్యాపారం పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది.

జూన్ నెలలో బుధుడు డబుల్ ధమాకా

జూన్ 6వ తేదీన ఉదయం 9:29 గంటలకు బుధుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. శుభప్రదంగా ఉంటుంది. అలాగే జూన్ 22వ తేదీన రాత్రి 9:33 గంటలకు బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం కూడా కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. శుభ ఫలితాలను అందిస్తుంది.

జూన్ నెలలో బుధుడు రెండు రాశుల సంచారంతో ఈ రాశుల వారికి బోలెడు లాభాలు

జూన్ నెలలో బుధుడు రెండు రాశులు మారడంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశుల వారికి బుధుడు అనేక లాభాలని అందిస్తాడు. ఈ సమయంలో ఈ రాశుల వారికి కలిసి వస్తుంది, సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

1.కన్య రాశి

బుధుడు రెండు రాశులలో సంచారం చేయడంతో కన్యా రాశి వారికి కలిసి రాబోతోంది. కెరియర్లో పురోగతి ఉంటుంది. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ సమయంలో కన్యా రాశి వ్యాపారులకి కూడా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా భారీగా లాభాలు ఉంటాయి.

2.తులా రాశి

తులా రాశి వారికి బుధుడు రెండు రాశుల మార్పుతో అదృష్టం కలిసి వస్తుంది. విదేశాలకు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకి కూడా ఈ సమయం లాభదాయకంగా ఉంది.

3.మీన రాశి

మీన రాశి వారికి బుధుడు రెండు రాశులు మార్పు చెందడంతో కలిసి రాబోతోంది. కొత్త ఆస్తులని కొనుగోలు చేసే అవకాశం ఉంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం కూడా ఉంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.