Raja yogam: శుక్ర రాశిలో 4 రాజయోగాలు.. 14 రోజుల పాటు వీరికి బ్రహ్మాండమైన ప్రయోజనాలు
Raja yogam: మే 31వ తేదీ నుంచి శుక్ర రాశిలో నాలుగు రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఫలితంగా 14 రోజుల పాటు కొన్ని రాశుల వారికి బ్రహ్మాండమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి.
Raja yogam: వైదిక జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలు, విచక్షణ, సంపద, వాక్కు, సుఖ సంతోషాలకు కారకుడు. మే నెలాఖరులో బుధుడు తన రాశి చక్రాన్ని మరో సారి మార్చుకుంటాడు.
సంబంధిత ఫోటోలు
Feb 14, 2025, 08:05 AMGuru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 3 రాశులకు అదృష్టం, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 14, 2025, 06:15 AMఇక ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు! జీవితంలో అపార సంతోషం..
Feb 13, 2025, 08:09 AMRahu Transit: రాహువు కుంభ రాశి సంచారం.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 12, 2025, 08:57 PMఈ మూడు రాశులకు గుడ్టైమ్ షురూ.. అన్నింటా అదృష్టం!
Feb 12, 2025, 08:23 AMSun Transit: కుంభ రాశిలో సూర్యుడి సంచారం, 4 రాశుల వారి జీవితంలో మార్పులు.. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధితో పాటు ఎన్నో
Feb 11, 2025, 02:22 PMShani Transit: పూర్వభాద్రపద నక్షత్రంలో శని సంచారం.. 3 రాశులకు ఆస్తి, వాహన, గృహ యోగం
మే 31వ తేదీ బుధుడు శుక్రుడికి చెందిన వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ 14 వరకు ఈ రాశిలో ఉంటాడు. అత్యంత వేగంగా రాశిని మార్చుకునే గ్రహంగా బుధుడికి పేరు ఉంటుంది. బుధుడు వెళ్లబోతున్న వృషభ రాశిలో ఇప్పటికే దేవ గురువు బృహస్పతి, గ్రహాల రాజు సూర్యుడు, సంపదను ఇచ్చే శుక్రుడు ఉన్నారు. వృషభ రాశిలో బుధుడి సంచారం వల్ల అనేక రాజయోగాలు ఏర్పడబోతున్నాయి.
బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. బుధుడు శుక్రుడితో సంయోగం చెందటం వల్ల లక్ష్మీ నారాయణ యోగం సృష్టిస్తుంది. అలాగే శుక్రుడు, బృహస్పతి కలిసి ఇప్పటికే గజలక్ష్మీ రాజయోగం ఏర్పరిచారు. ఇది మాత్రమే కాకుండా ఒకే రాశిలో నాలుగు గ్రహాల కలయిక జరుగుతుంది. బుధుడు, బృహస్పతి, సూర్యుడు, శుక్రుడు కలిసి చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి 14 రోజుల పాటు బ్రహ్మాండమైన ప్రయోజనాలు లభిస్తాయి. శారీరక సౌకర్యాలు పెరుగుతాయి. ప్రతి రంగంలోనూ మీదే విజయం. బుధుడి సంచారంతో ఏయే రాశులకు ఈ వరం లభిస్తుందో చూద్దాం.
వృషభ రాశి
నాలుగు రాజయోగాలకు వృషభ రాశి వేదిక అవనుంది. ఫలితంగా మే 31నుంచి వృషభ రాశి జాతకులకు చతుర్గ్రాహి యోగంతో ప్రకాశిస్తారు. ప్రతి పనిలో అదృష్టం మీకు మద్ధతు ఇస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. నూతన ఆదాయమార్గాలు ఏర్పడతాయి. సంపద పెరుగుతుంది. మంచి ప్యాకేజీతో కొత్త జాబ్ ఆఫర్ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి.
కన్యా రాశి
బుధ సంచారం వల్ల ఏర్పడిన మూడు రాజయోగాలు కన్యా రాశి వారికి మేలు చేస్తాయి. జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు తీసుకువస్తాయి. ఆదాయ వనరుల మధ్య సమతుల్యత ఉంటుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అకడమిక్ పనిలో మంచి ఫలితాలు పొందుతారు.
ధనుస్సు రాశి
రాజయోగాల ప్రభావంతో ధనుస్సు రాశి వాళ్ళు ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు అవుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద, ధాన్యాలు నిల్వ నిండిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆవివాహితులకు వివాహాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. సంతమ వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య క్షేత్రాలకు వెళ్ళే అవకాశం ఉంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు.
మకర రాశి
మకర రాశి వారికి బుధ సంచారం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. డబ్బు సంపాదించడానికి అనేక సువర్ణావకాశాలు లభిస్తాయి. సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. జీవిత భాగస్వామి మద్ధతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయి. కొంతమంది ఉద్యోగ అన్వేషణ పూర్తవుతుంది. ఈ సమయంలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఉంది.
టాపిక్