Mercury transit: గ్రహాల రాకుమారుడు ఈ రాశుల వారికి స్వర్ణ కాలాన్ని ఇవ్వబోతున్నాడు-mercury transit into mesha rasi these zodiac signs get lucky days starts from may 10th 2024 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Transit: గ్రహాల రాకుమారుడు ఈ రాశుల వారికి స్వర్ణ కాలాన్ని ఇవ్వబోతున్నాడు

Mercury transit: గ్రహాల రాకుమారుడు ఈ రాశుల వారికి స్వర్ణ కాలాన్ని ఇవ్వబోతున్నాడు

Gunti Soundarya HT Telugu
May 03, 2024 11:31 AM IST

Mercury transit: గ్రహాల రాకుమారుడు త్వరలో రాశిని మార్చుకోబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి స్వర్ణ కాలం ప్రారంభం కాబోతుంది. అందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.

 మేష రాశిలో బుధుడి సంచారం
మేష రాశిలో బుధుడి సంచారం

Mercury transit: నవగ్రహాలలో అత్యంత వేగంగా కదిలే గ్రహం బుధుడు. గ్రహాల రాకుమారుడిగా పరిగణించే బుధుడు అతి తక్కువ సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాడు. 

అటువంటి బుధుడు మే 10వ తేదీ అక్షయ తృతీయ నాడు మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడి శుభ స్థానం వల్ల వృత్తి, వ్యాపారాల పరిస్థితి బాగుండడంతో పాటు మంచి లాభాలు కూడా వస్తాయి. మే 30 వరకు ఇదే రాశిలో బుధుడు సంచరిస్తాడు. అటువంటి పరిస్థితుల్లో బుధుడి కదలిక వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది.

కొన్ని రాశుల వారికి స్వర్ణ కాలం ప్రారంభం కాబోతుంది. సంపద, కీర్తి, తెలివితేటలు, విచక్షణను బుధుడు ప్రసాదిస్తాడు. జ్యోతిష లెక్కల ప్రకారం మేష రాశిలో బుధుడి సంచారం వల్ల ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి. మేష రాశిలో కొద్ది రోజుల తర్వాత సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. అలాగే శుక్రుడు, బుధుడు కలిసి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. 

50 ఏళ్ల తర్వాత మేష రాశిలో రెండు అద్భుతమైన శుభ యోగాలు ఏర్పడుతున్నాయని పండితులు చెబుతున్నారు. ఒకే నెలలో రెండు సార్లు బుధుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. మే 31వ తేదన వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడి సంచారం వల్ల ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. 

మేష రాశి

మేష రాశిలో బుధుడి సంచారం వల్ల వీరికి వృత్తిలో అపారమైన విజయాలు పొందుతారు. శత్రువులను ఓడిస్తారు. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు వివిధ ఒప్పందాల నుంచి అనుకూలమైన లాభాలు పొందుతారు. శుభ కార్యాలు నిర్వహించుకోవచ్చు. 

ధనుస్సురాశి

బుధుడి సంచారం వల్ల ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. మీ జీవితంలో సానుకూలత ఉంటుంది. ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. అదే సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్ కి వెళతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేయగలుగుతారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. 

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి బుధుడి సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి పెట్టుబడిదారులు దొరుకుతారు. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. మాటల ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు. కెరీర్ జీవితంలో కనిపించే మార్గాలు మీ ఎదుగుదలకు సహాయపడతాయి. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. 

మకర రాశి

బుధుడి కదలిక మకర రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. బుధుడి శుభ ప్రభావంతో అనేక పనులు సాధిస్తారు. సమాజంలో మీ హోదా, ప్రతిష్ట పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ కాలంలో అనేక కొత్త పెట్టుబడి ఎంపికలు పొందుతారు. 

 

Whats_app_banner