మే 23 నుండి వృషభ రాశిలో బుధుడి సంచారం.. ఈ 4 రాశులకు శుభవార్తలు, ఆర్థిక లాభాలు ఇలా ఎన్నో!-mercury transit in tarus on may 23rd these 3 zodiac signs will get lots of benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మే 23 నుండి వృషభ రాశిలో బుధుడి సంచారం.. ఈ 4 రాశులకు శుభవార్తలు, ఆర్థిక లాభాలు ఇలా ఎన్నో!

మే 23 నుండి వృషభ రాశిలో బుధుడి సంచారం.. ఈ 4 రాశులకు శుభవార్తలు, ఆర్థిక లాభాలు ఇలా ఎన్నో!

Peddinti Sravya HT Telugu

మే 23న బుధుడు మేష రాశి నుండి వృషభ రాశికి ప్రవేశిస్తాడు. ఇది కొన్ని రాశుల వారికి మాత్రమే గొప్ప అదృష్టాన్ని తెస్తుంది. ఏ రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయో తెలుసుకోండి. ఈ రాశుల్లో మీరు కూడా ఒకరు కావచ్చు.

మే 23 నుండి వృషభ రాశిలో బుధుడి సంచారం

జ్యోతిష్య శాస్త్రంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. బుధుడిని రాజకుమారుడు అని పిలుస్తారు. 2025 మే 23న, మేష రాశి నుండి వృషభ రాశికి బుధుడు ప్రవేశిస్తాడు. బుధ గ్రహం బుద్ధి, కమ్యూనికేషన్, గణితం, స్నేహానికి గ్రహంగా చెప్పబడుతుంది. వృషభ రాశిలోకి బుధుడి ప్రవేశం వలన కొన్ని రాశుల వారు ప్రయోజనం పొందుతాయి.

వృషభ రాశిలోకి బుధుడి సంచారంతో ఈ రాశులకు బోలెడు లాభాలు

1.వృషభ రాశి:

బుధుడి సంచార ప్రభావం వలన, వృషభ రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. జీవితంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. భాగస్వామి నుండి మద్దతు పొందుతారు. కొత్త పనిని ప్రారంభించవచ్చు. జీవితంలో కొత్త అనుభవాలు ఉంటాయి.

2.కర్కాటక రాశి:

బుధ సంచారము కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వివాహం గురించి చర్చలు జరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

3.కన్యా రాశి

కన్యా రాశి వారికి సంపద, సమృద్ధి పెరుగుతుంది. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా వుంటారు. చట్టపరమైన విషయాలలో గెలుస్తారు. పిల్లల నుండి శుభవార్త అందుతుంది. బకాయి ఉన్న డబ్బు తిరిగి వస్తుంది. ఊహించని ఆర్థిక లాభాలు ఉండవచ్చు. భూమి, వాహన సంతోషం పొందుతారు.

4.ధనుస్సు రాశి:

మాటలో మాధుర్యం ఉంటుంది. కొత్త వనరులు ద్వారా ఆర్థిక లాభాలను తెస్తుంది. జీవితం సౌకర్యవంతంగా గడుస్తుంది. కార్యాలయంలో కొత్త గుర్తింపు పొందుతారు. ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. భూమి లేదా వాహనం కొనుగోలు సాధ్యమవుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.