Mercury transit: గ్రహాల రాకుమారుడి రాకతో ఈ రాశుల జీవితంలో సంతోషం నిండిపోతుంది, ధన ప్రాప్తి-mercury transit in leo these zodiac signs life get full happiness ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Transit: గ్రహాల రాకుమారుడి రాకతో ఈ రాశుల జీవితంలో సంతోషం నిండిపోతుంది, ధన ప్రాప్తి

Mercury transit: గ్రహాల రాకుమారుడి రాకతో ఈ రాశుల జీవితంలో సంతోషం నిండిపోతుంది, ధన ప్రాప్తి

Gunti Soundarya HT Telugu

Mercury transit: గ్రహాల రాకుమారుడు బుధుడు మరికొద్ది రోజుల్లో సింహ రాశిలో సంచరిస్తాడు. దీని వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో సంతోషంతో నిండిపోతుంది. ధన ప్రాప్తి కలుగుతుంది. అవి ఏ రాశులో తెలుసుకుందాం.

సింహ రాశిలోకి బుధుడు

Mercury transit: బుధుడు మేధస్సు, తర్కం, కమ్యూనికేషన్, గణితం, తెలివి, స్నేహానికి బాధ్యత వహించే గ్రహంగా పిలుస్తారు. బుధుడిని గ్రహాల రాకుమారుడు అని కూడా అంటారు. ప్రస్తుతం బుధుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. జూలై 19న బుధుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు నవగ్రహాలలో అత్యంత వేగంగా రాశిని మార్చుకోగలుగుతాడు. 

బుధుడు సింహ రాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టవంతులు అవుతారు. జ్యోతిష్యంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడు సింహ రాశికి అధిపతి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు, సూర్యుడు స్నేహపూర్వక గ్రహాలుగా పరిగణిస్తారు. బుధుడు సింహ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుందో తెలుసుకుందాం. 

వృషభ రాశి 

ఉద్యోగ, వ్యాపారాలలో విజయావకాశాలు ఉంటాయి. ఐటీ, ఆరోగ్య సంరక్షణ నిపుణులు విదేశాలలో పని చేయడానికి ఆఫర్లను పొందవచ్చు. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. పూర్తి విశ్వాసం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఊహించని సమయాల్లో ఎక్కువ లాభాలు పొందుతారు. తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఈ సమయంలో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

సింహ రాశి 

సింహ రాశి వారికి చాలా శుభ ఫలితాలు లభిస్తాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పని విజయవంతమవుతుంది, ఉద్యోగం, వ్యాపారంలో అడ్డంకులను తొలగించడంలో అదృష్టం మీకు తోడ్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనలాభానికి అనేక అవకాశాలు ఉంటాయి. బుధుడు సింహ రాశి మొదటి ఇంట్లో సంచరించబోతున్నాడు. ఇది మీ వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ప్రణాళికాబద్ధమైన పనులు మీకు పురోగతి తెస్తాయి. వివాహం చేసుకున్న వారి జీవితంలో సంతోషం ఉంటుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. 

కన్యా రాశి 

కన్యా రాశికి అధిపతి బుధుడు. అందువల్ల ఈ సంచారం కన్యా రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. కెరీర్‌లో పురోభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించవచ్చు. అనేక ఆదాయ వనరుల నుండి ఆర్థిక లాభాలు ఉంటాయి. న్యాయపరమైన విషయాల్లో విజయం ఉంటుంది. మీరు డబ్బు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

ధనుస్సు రాశి 

సంఘంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఆఫీసులో పనికి సంబంధించిన అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్నేహితులు అండగా నిలుస్తారు. ఉద్యోగంలో పదోన్నతి, వేతన పెంపు పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకర పరిస్థితులు నెలకొంటాయి. 

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.