Mercury Leo Transit: బుధుడి సంచారంతో ఈ మూడు రాశుల వారికి ఊహించని లాభాలు
Mercury Leo Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడి స్థానం బలంగా ఉంటే ఆ రాశి వారికి ఏ లోటూ ఉండదు. బుధుడి సంచారంతో ఓ మూడు రాశుల వారికి సెప్టెంబరు మాసంలో పట్టిందల్లా బంగారం కాబోతోంది.
Mercury Leo Transit: బుధుడు త్వరలోనే తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఆ మార్పు ప్రభావం మొత్తం 12 రాశులపై కనిపించనుంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో బుధుడు సంచరిస్తున్నారు. సెప్టెంబరు మాసంలో బుధుడు తన రాశిచక్రాన్ని మారుస్తాడు. దాంతో కొన్ని రాశుల వారికి అదృష్టం వరించబోతోంది. మరి కొన్ని రాశుల వారికి ఇబ్బందులు రానున్నాయి.
సెప్టెంబరు నెలలో సింహ రాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. బుధుడి సంచారం వల్ల ఏయే రాశుల వారికి మంచి జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
బుధుడి సంచారం ధనుస్సు రాశి వారికి శుభప్రదం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ధనుస్సు రాశి విద్యార్థులు చదువు పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తారు. వ్యాపారస్తులు మంచి ప్రణాళికలతో వ్యాపారంలో మెరుగైన లాభాలు ఆర్జించవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలానే జంక్ ఫుడ్ తినడం మానుకోండి. ధనలాభం పొందే అవకాశం పుష్కలంగా ఉంది.
తులా రాశి
బుధుడి సంచారం తులా రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మీరు వేసే ప్రతి వ్యూహం విజయానికి మెట్లు అవుతుంది. మీరు ఒక పనికి సంబంధించి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండండి. వ్యాపారంలో నిలిచిపోయిన డబ్బును మళ్లీ తిరిగి పొందుతారు.
సింహ రాశి
బుధుడి సంచారంతో సింహ రాశి వారికి ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపారంలో డబ్బుకి సంబంధించిన ఒత్తిడి మీకు దూరమవుతుంది. అదే సమయంలో మీ పనితీరును కూడా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం ఇవ్వండి.
నిరాకరణ: పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చింది. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.