గ్రహాల రాజకుమారుడు బుధుడు తన రాశి, గమనం మరియు స్థితిని నిర్దిష్ట సమయాల్లో మారుస్తాడు. ప్రస్తుతం బుధుడు శనితో కలిసి కుంభ రాశిలో అస్తమించిన స్థితిలో ఉన్నాడు. బుధుడు జనవరి 20, 2025 న అస్తమించాడు. ఫిబ్రవరి 22, 2025 రాత్రి 07:04 గంటలకు ఉదయిస్తాడు. బుధుడు దాదాపు 34 రోజుల తర్వాత ఉదయిస్తున్నాడు.
మేషం నుండి మీనం రాశి వరకు ప్రభావం చూపుతుంది. కానీ కొన్ని రాశులపై బుధుడు అపరిమిత అనుగ్రహాన్ని కురిపిస్తాడు. ఈ రాశులకు ఆర్థిక, వ్యాపార, వ్యక్తిగత జీవితంలో శుభ ఫలితాలు లభిస్తాయి. ఇక ఈ ప్రభావం ఏ రాశులకు లాభం ఉంటుందో తెలుసుకుందాం.
ఈ మార్పు వలన మేష రాశి వారికి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారపరంగా మీరు మెరుగైన స్థితిలో ఉంటారు. ప్రభుత్వ వ్యవస్థ నుండి లాభం లభిస్తుంది. రాజకీయాల్లో ఉన్నవారికి కూడా అదృష్టవంతమైన రోజులు వస్తున్నాయి. పెట్టుబడులకు మంచి రాబడి లభించవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు.
వృశ్చిక రాశి వారికి భౌతిక సుఖ సమృద్ధి పెరుగుతుంది. కుటుంబంలో పెరుగుదల ఉంటుంది. భూమి, భవనం, వాహనం కొనుగోలు చేయవచ్చు. వ్యాపారులకు విస్తరణ లేదా భాగస్వామ్యాలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. తల్లిదండ్రులతో సంబంధాలు బలపడతాయి. ఆర్థిక విషయాల్లో విజయం సాధిస్తారు.
మీ గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. పనులను నేర్పుగా పూర్తి చేస్తారు. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. వ్యాపారులకు ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. కొంతమంది జాతకాల జీవితంలో కొత్త ప్రేమ ప్రవేశిస్తుంది. కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం