త్వరలో కర్కాటక రాశిలోకి బుధుడు, ఈ మూడు రాశులకు బోలెడు లాభాలు.. ఆనందం, సంపద ఇలా ఎన్నో!-mercury transit in cancer and it give lots of benefits to libra virgo gemini ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  త్వరలో కర్కాటక రాశిలోకి బుధుడు, ఈ మూడు రాశులకు బోలెడు లాభాలు.. ఆనందం, సంపద ఇలా ఎన్నో!

త్వరలో కర్కాటక రాశిలోకి బుధుడు, ఈ మూడు రాశులకు బోలెడు లాభాలు.. ఆనందం, సంపద ఇలా ఎన్నో!

Peddinti Sravya HT Telugu

త్వరలోనే చంద్రుని రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి బుధుడి సంచారం ఉంటుంది. ప్రస్తుతం బుధుడు తన సొంత రాశి మిథున రాశిలో ఉంటాడు. బుధుడి సంచారం వల్ల మొత్తం 12 రాశుల వారు ప్రభావితమవుతారు. బుధుడి రాశి మార్పుతో ఈ మూడు రాశులకు ఎన్నో లాభాలు కలుగుతాయి.

బుధుడి రాశి మార్పుతో ఈ మూడు రాశులకు ఎన్నో లాభాలు

మరికొద్ది రోజుల్లో గ్రహాల రాకుమారులు తమ రాశిని మారుస్తాడు. త్వరలోనే చంద్రుని రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి బుధుడి సంచారం ఉంటుంది. ప్రస్తుతం బుధుడు తన సొంత రాశి మిథున రాశిలో ఉంటాడు. బుధుడి సంచారం వల్ల మొత్తం 12 రాశుల వారు ప్రభావితమవుతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం జూన్ 22, ఆదివారం రాత్రి 09:33 గంటలకు బుధుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు.

ఆగస్టు 30 వరకు బుధుడు ఈ రాశిలో సంచరిస్తాడు. అటువంటి పరిస్థితిలో, బుధుడి రాశి మార్పు కారణంగా కొన్ని రాశుల బంగారు సమయం ప్రారంభమవుతుంది. మరి బుధుడి సంచారం వలన ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుంది?, వారు ఏయే లాభాలను పొందుతారు అనే వాటి గురించి ఇప్పుడే తెలుసుకుందాం.

బుధుడి రాశి మార్పుతో ఈ మూడు రాశులకు ఎన్నో లాభాలు

1.తులా రాశి

తులా రాశి ప్రజలకు కర్కాటక రాశిలో బుధ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులు ప్రశంసల వస్తువులుగా మారవచ్చు. వ్యాపారులకు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.

చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు, వాటిని మీ భాగస్వామి మద్దతుతో సులభంగా పరిష్కరించుకోవచ్చు. మీరు ఎంత నిర్భయంగా ఉంటే అంత మంచిది. విజయాలను కూడా అందుకోవచ్చు.

2.కన్య రాశి

కన్య రాశి వారికి బుధుడి రాశి మార్పు శుభప్రదంగా ఉంటుంది. నిలిచిపోయిన మీ పనులు పూర్తవుతాయి. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఈ సమయం చాలా శుభప్రదంగా భావిస్తారు. మీరు ఆనందం, సంపదను పొందుతారు. అదే సమయంలో, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

3.మిథున రాశి

బుధ సంచారం మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. పనిప్రాంతంలో మీ స్నేహితులు, బాస్ నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చు. కొత్త పెట్టుబడి ఎంపికల గురించి ఆలోచించవచ్చు. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.