రేపు ధనుస్సు రాశి నుంచి అస్తమిస్తున్న బుధుడు.. ఈ 4 రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్.. తస్మాత్ జాగ్రత్త-mercury transit from dhanu rasi these zodiac signs should be cautious and may suffer with problems so be careful ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  రేపు ధనుస్సు రాశి నుంచి అస్తమిస్తున్న బుధుడు.. ఈ 4 రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్.. తస్మాత్ జాగ్రత్త

రేపు ధనుస్సు రాశి నుంచి అస్తమిస్తున్న బుధుడు.. ఈ 4 రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్.. తస్మాత్ జాగ్రత్త

Peddinti Sravya HT Telugu
Jan 17, 2025 12:00 PM IST

ధనుస్సు రాశిని బుధుడు అస్తమించడం వలన పలు రాశుల వాళ్లకు కష్టాలు కలగనున్నాయి. విద్యార్థులకు సమస్యలు కలగడమే కాకుండా ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండడం మంచిది.

బుధ గ్రహ సంచారం
బుధ గ్రహ సంచారం (Pixabay)

ప్రస్తుతం బుధుడు ధనస్సు రాశిలో ఉన్నాడు. జనవరి 4న బుధుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు. ఒక రాశి చక్రం నుంచి ఇంకో రాశి చక్రానికి మారడానికి 21 రోజుల సమయం పడుతుంది. బుధ గ్రహం ధనస్సు రాశిని జనవరి 18 శనివారం ఉదయం 6:55 గంటలకు అస్తమిస్తాడు.

సంబంధిత ఫోటోలు

అయితే, ధనుస్సు రాశిని బుధుడు అస్తమించడం వలన పలు రాశుల వాళ్లకు కష్టాలు కలగనున్నాయి. విద్యార్థులకు సమస్యలు కలగడమే కాకుండా ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ రాశికి కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో చూసుకోండి.

1. మేష రాశి

మేష రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన పనుల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓటమిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు వస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండడం అవసరం. ప్రేమ సంబంధాల్లో అధిక పని కారణంగా మీ భాగస్వామికి సమయం ఇవ్వడంలో విఫలమవుతారు. అలాగే ఏదైనా పని చేస్తున్నప్పుడు తొందరపడొద్దు. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

2. వృషభ రాశి

ఇక ఈ రాశి వారి విషయానికి వస్తే, వృషభ రాశి వారికి ఈ సమయం కష్టంగా ఉంటుంది. ఆర్థికపరంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. డబ్బు కొరత కారణంగా ఆందోళన చెందుతారు. మీరు మీ పనిపై ధ్యాస ఎక్కువగా పెట్టండి. ఇతరులు చెప్పే వాటికి ప్రభావితం అవ్వద్దు. మీ పని మీరే చేయడానికి ప్రయత్నం చేయడం మంచిది.

3. సింహ రాశి

ఈ సమయంలో సింహ రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ, వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా కష్ట సమయం కష్టాలు రాబోతున్నాయి. ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సింహ రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది.

4. ధనస్సు రాశి

బుధుడు ధనస్సు రాశి నుంచి అస్తమిస్తున్న సమయంలో ధనుస్సు రాశి వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖర్చులు పెరగొచ్చు. ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు వద్దు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం