3 Planet transition: బుధ, సూర్య, శని గ్రహాల సంచారం.. 5 రాశులకు శుభ ఘడియలు ఆసన్నం
జూన్ నెలలో బుధుడు, సూర్యుడు, శని తమ గమనాన్ని మార్చుకుంటారు. దీని వల్ల 5 రాశులకు శుభ ఘడియలు ఆసన్నమవుతున్నాయి.
బుధుడు, సూర్యుడు, శని గ్రహాలు ప్రస్తుతం ఉన్న తమ రాశులను వీడి వేరొక రాశిలోకి సంక్రమణం చెందుతారు. ఆయా గ్రహాల సంచారం కారణంగా వివిధ రాశులపై సానుకూల, ప్రతికూల ప్రభావం పడుతుంది.
జూన్ 7న బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తరువాత జూన్ 15న సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ 17న శని కుంభరాశిలో తిరోగమనంలో ఉంటుంది. జూన్ 24న బుధుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా బుధుడు, సూర్యుడు, శని తమ గమనాన్ని మార్చడం వల్ల 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి.
మేష రాశి:
మేష రాశి జాతకులకు మనస్సు కలత చెందుతుంది. మనస్సులో నిరాశ, అసంతృప్తి ఉంటుంది. తండ్రి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనవసర కోపానికి, వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృషభ రాశి:
వృషభ రాశి జాతకులకు మనస్సులో ఒడిదుడుకులు ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. పురోగతికి అవకాశాలు ఉంటాయి.
మిథున రాశి:
ఆత్మ విశ్వాసం పెరిగినప్పటికీ మనసు ఇంకా కలతగానే ఉంటుంది. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. కోపాన్ని దరి చేరనివ్వకండి. మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. పనిలో విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి:
మనసు సంతోషంగా ఉంటుంది. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. సంతానంలో ఆనందం పెరుగుతుంది. వ్యాపారంలో హడావిడి ఉంటుంది. అయినప్పటికీ లాభావకాశాలు కూడా ఉంటాయి.
సింహ రాశి:
సింహ రాశి జాతకుల్లో ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది. కానీ స్వీయ నియంత్రణలో ఉండాలి. కోపం రానివ్వొద్దు. కుటుంబంలో శాంతి నెలకొనడానికి ప్రయత్నించాలి. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత చదువుల కోసం మీ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్యా రాశి:
మనసు కలతగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. మనసులో ఒడిదుడుకులు ఉంటాయి. సహనంగా ఉండాలి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయ. ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి.
తులా రాశి:
మనస్సు అశాంతిగా ఉంటుంది. స్వీయ స్పృహతో ఉండాలి. కోపాన్ని ప్రదర్శించవద్దు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండండి. విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుంది.
వృశ్చిక రాశి:
ఆత్మ విశ్వాసం నిండినా మనసు కలత చెందుతుంది. స్వీయ స్పృహతో ఉండాలి. సహనంగా మెలగాలి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆదాయ మెరుగుపడుతుంది. కానీ శ్రమ ఎక్కువగా ఉంటుంది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అయినప్పటికీ మనసులో ఒడిదుడుకులు ఉంటాయి. అనవసర తగాదాలు, వివాదాలకు దూరంగా ఉండాలి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వ్యసనాలను వదులుకుంటారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంటుంది.
మకర రాశి:
మకర రాశి జాతకులకు ఇది శుభ సమయం. సంతోసంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యావకాశాలు మెరుగుపడుతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. లాభాలకు అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి:
మనస్సు అశాంతిగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. స్వీయ స్పృహతో ఉండాలి. అనవసర కోపానికి, వాదోపవాదలకు దూరంగా ఉండాలి. మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల ప్రోత్సహం ఉంటుంది.
మీన రాశి:
మనసులో నిరాశ, నిస్పృహలు కలుగుతాయి. కుటుంబంలో శాంతి నెలకొనడానికి ప్రయత్నించండి. విద్యాపరమైన పనులు మెరుగుపడుతాయి. ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ఉంటుంది.