Mercury rise: ఈ ఏడాది చివర నుంచి వీరి తలరాతలు మార్చి డబ్బు వరంగా ఇవ్వబోతున్న గ్రహాల రాకుమారుడు
Mercury rise: గ్రహాల రాకుమారుడు బుధుడు డిసెంబర్ నెలలో ఉదయించబోతున్నాడు. దీని వల్ల మూడు రాశుల వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ ఏడాది చివరి నుంచే వీరి తలరాత మారబోతుంది. కొత్త ఏడాది సరికొత్త శుభవార్తలతో అడుగుపెట్టబోతున్నారు.
నవగ్రహాలలో సూర్యుడికి అతి దగ్గరగా ఉండే బుధ గ్రహానికి గ్రహాల రాకుమారుడు అనే బిరుదు ఉంది. అతి తక్కువ సమయంలో రాశిని మారుస్తుంది. తర్కం, తెలివితేటలు, కమ్యూనికేషన్స్, మేధస్సు, వ్యాపారం వంటి వాటికి ప్రతీకగా చూస్తారు. ప్రస్తుతం అస్తంగత్వ దశలో ఉన్న బుధుడు వచ్చే నెలలో ఉదయించబోతున్నాడు.
డిసెంబర్ 11న వృశ్చిక రాశిలో ఉదయించబోతున్నాడు. బుధ సంచారం సానుకూలంగా ఉంటే ఒక వ్యక్తి నైపుణ్యాలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. డిసెంబర్ లో ఉదయించిన బుధుడు కొత్త సంవత్సరం 2025 మార్చి వారకు చాలా చురుకుగా కదులుతాడు. ఈ సమయంలో వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. ఆలోచనా విధానం పాజిటివ్ గా ఉంటుంది. బుధుడు ఉదయించడం వల్ల ఏయే రాశులకు అదృష్టం కలుగుతుందో చూద్దాం.
వృషభ రాశి
వృషభ రాశి వారికి దీర్ఘకాలిక విజయాలు సొంతం అవుతాయి. వృత్తి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆదాయ వనరులు ఊహించని విధంగా తారసపడతాయి. బుధ అనుగ్రహంతో కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడి ఇతరులను ఆకర్షించగలుగుతారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా బలపడతారు. మాటల ప్రభావం కారణంగా ఇతరులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
కర్కాటక రాశి
బుధుడి సంచారం కర్కాటక రాశి వారికి ఎదిగేందుకు అనుకూలమైన సమయం. వ్యాపారంలో మీరు పెట్టె పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయి. స్పష్టమైన ఆలోచనలు, నిర్ణయాలతో జీవితంలో ముందుకు సాగుతారు. సృజనాత్మక రంగంలో విజయాలు సాధిస్తారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని విషయాలలో ధైర్యంగా ముందడుగు వేస్తారు. కఠినమైన సవాళ్ళను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మెరుగుపడతాయి.
మకర రాశి
బుధ సంచారం మకర రాశి వారికి మెరుగైన ఫలితాలు ఇస్తుంది. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగులకు ఇది ఆనందం కాలం. కొత్త సంవత్సరంలో మీకు పెట్టుబడుల నుంచి మంచి ఆర్థిక లాభాలు చేతికి అందుతాయి. లక్ష్యాలపై దృష్టి పెట్టడం వల్ల అనుకున్నవి సాధించగలుగుతారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి.
బుధుడు సానుకూల ఫలితాలు ఇచ్చినప్పుడు జీవితం సాధారణంగా గడిచిపోతుంది. అదే జాతకంలో బుధ స్థానం ప్రతికూలంగా ఉంటే మాత్రం ఒడిదుడుకులు ఎదురవుతాయి. వాటిని అధిగమించేందుకు బుధ వ్యతిరేక ప్రభావాలు తగ్గించుకునేందుకు కొన్ని చర్యలు మీద దృష్టి సారించాలి. అప్పుడే బుధ గ్రహం బలపడుతుంది. తొందరపాటు నిర్ణయాలు, అనాలోచితంగా ఆవేశపూరితంగా ప్రవర్తించకూడదు. ఇతరులతో కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి. ఆర్థిక అంశాల మీద దృష్టి పెట్టుకోవాలి. అప్పుడే బుధుడి సానుకూల ఫలితాలు సరిగా వినియోగించుకోగలుగుతారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.