Mercury rise: ఉదయించబోతున్న బుధుడు.. ఈ రాశుల వారికి వ్యాపారంలో నష్టాలు
Mercury rise: గ్రహాల రాకుమారుడు బుధుడు త్వరలో ఉదయించబోతున్నాడు. దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి వ్యాపారంలో నష్టాలు ఎదురుకాబోతున్నాయి. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారి మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.
Mercury rise: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం తన రాశి చక్రాన్ని మార్చుకుంటూ ఉంటుంది. గ్రహాల సంచారం వల్ల మొత్తం 12 రాశుల మీద దాని ప్రభావం ఉంటుంది. ఫలితంగా జీవితంలో విభిన్న పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రహాల సంచారంతో కొంతమంది ఆనందకరమైన జీవితాన్ని గడిపితే, మరి కొందరు మాత్రం కష్టాలను అనుభవించాల్సి వస్తుంది.
ప్రస్తుతం అస్తంగత్వ దశలో ఉన్న గ్రహాల రాకుమారుడు బుధుడు త్వరలో ఉదయించబోతున్నాడు. దీని ఫలితంగా కొన్ని రాశుల వాళ్ళు వ్యాపారంలో గణనీయమైన క్షీణత ఎదుర్కొంటారు. ఏప్రిల్ 19న మీన రాశిలో బుధుడు ఉదయించబోతున్నాడు. దీని ప్రభావంతో వ్యాపారం చేసే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వ్యాపారంలో ధన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
బుధుడిని మేధో గ్రహంగా పిలుస్తారు. హేతుబద్ధత, విద్య, కమ్యూనికేషన్ సామర్ధ్యాలను బుధుడు సూచిస్తాడు. బుధుడి స్థానం బలహీనంగా ఉంటే మనసు అభద్రతా భావనతో నిండిపోతుంది. భయం వెంటాడుతుంది. బుధుడి అస్తంగత్వ దశ నుంచి ఉదయించినప్పుడు ఒక వ్యక్తి అదృష్టం కూడా మేల్కొంటుంది. మీన రాశిలో బుధుడు ఉదయించడం వల్ల ఈ రాశుల వారికి వ్యాపార నష్టాలు కలుగుతాయి.
మేష రాశి
బుధుడు ఉదయించినప్పుడు మేష రాశి వారి వ్యాపారం సరిగా సాగకపోవచ్చు. ఈ సమయంలో వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్ష్యాలను సాధించలేరు. అలాగే లాభాలు పొందలేరు. కొత్త వ్యాపారాన్ని ఏర్పాటు చేయడం, భాగస్వామ్య వ్యాపారం చేయడం వంటివి మంచిది కాదు. అలా చేస్తే నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో వ్యాపారవేత్తలు కొత్తవారిని విశ్వసించడం మానుకోవాలి. లేదంటే మోసపోయే అవకాశం ఉంది.
తులా రాశి
బుధుడు ఉదయించినప్పుడు తులా రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీకు అదృష్ట సమయం కాదు. వ్యాపారంలో నష్టపోవాల్సి వస్తుంది. మానసిక క్షోభ ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉంటారు. వ్యాపారాన్ని గాడిలో పెట్టేందుకు సరైన ప్రణాళికలు అమలు చేయాలి. అప్పుడే మీ వ్యాపారాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు.
వృశ్చిక రాశి
ఈ సమయంలో వృశ్చిక రాశి వ్యాపారవేత్తలు తమ ఆదాయాన్ని పెంచుకోవడం కష్టంగా ఉంటుంది. సంపాదన పొందలేకపోతారు. దీని కారణంగా నిరుత్సాహానికి గురవుతారు. భాగస్వామ్య వ్యాపారం చేసే వారి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మాటలను నియంత్రణలో ఉంచుకోలేకపోతే అది మీ బంధానికి హాని కలిగించేదిగా మారుతుంది. సమస్య గురించి ఎదుటివారితో విభేదించకుండా ఉండటమే మంచిది.
కుంభ రాశి
బుధుడు ఉదయించే సమయంలో కుంభ రాశి జాతకులు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఈ సమయంలో మీ పోటీ దారులు మీ కంటే మెరుగ్గా పనిచేస్తారు. ప్రత్యర్ధులతో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫలితంగా గణనయమైన నష్టాలను చవిచూస్తారు. చాలా అప్రమత్తంగా ఉండాలి. సరైన వ్యూహాలను అమలుపరిచినప్పుడే మీ పరిస్థితి బాగుంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ సమయం అనువైనది కాదు. దేనిలోనైనా డబ్బులు పెట్టుబడి పెడితే నష్టాలు చవిచూస్తారు.