Mercury rise: ఉదయించబోతున్న బుధుడు.. ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు, జేబులు ఖాళీ కాబోతున్నాయి-mercury rise in mithuna rashi these zodiac signs face financial struggles ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Rise: ఉదయించబోతున్న బుధుడు.. ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు, జేబులు ఖాళీ కాబోతున్నాయి

Mercury rise: ఉదయించబోతున్న బుధుడు.. ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు, జేబులు ఖాళీ కాబోతున్నాయి

Gunti Soundarya HT Telugu
Jun 24, 2024 09:18 AM IST

Mercury rise: బుధుడు మరో మూడు రోజుల్లో ఉదయించబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక కష్టాలు ఎదురుకాబోతున్నాయి. ఏయే రాశులో ఇక్కడ తెలుసుకోండి.

ఉదయించబోతున్న బుధుడు
ఉదయించబోతున్న బుధుడు

Mercury rise: బుధుడు తొమ్మిది గ్రహాలకు రాకుమారుడు. విద్య, వ్యాపారం, స్టాక్ మార్కెట్, ఆర్థిక వ్యవస్థ, తెలివితేటలు, వాక్కు మొదలైన వాటికి అధిపతి. బుధుడు అతి తక్కువ సమయంలో తన స్థానాన్ని మార్చగలడు. గ్రహాల రాకుమారుడిగా పరిగణించే బుధుడు ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నాడు.

జూన్ 2 నుంచి అస్తంగత్వ దశలో ఉన్న బుధుడు ఉదయించబోతున్నాడు. జూన్ 27 సాయంత్రం మిథున రాశిలో బుధుడు ఉదయిస్తాడు .ఈ సమయంలో కొంతమంది ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉంది. ఏయే రాశుల వారు ఈ సమయంలో జాగ్రత్త వహించాలో తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి మూడు, ఆరు గృహాలకు బుధుడు అధిపతిగా ఉన్నాడు. జూన్ 27న మూడో గృహంలో బుధుడు ఉదయిస్తాడు. ఈ సమయం నుంచి మీ ఖర్చులో పెరుగుదల ఉంటుంది. పొదుపు, ఖర్చుల మధ్య సమతుల్యత సాధించడం సవాల్ గా మారుతుంది. ఆర్థిక పరిస్థితి క్షీణించే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి

బుధుడు వృశ్చిక రాశి ఎనిమిది, పదకొండు గృహాలకు అధిపతి. ఇప్పుడు ఎనిమిదో ఇంట్లో ఉదయించనున్నాడు. ప్రస్తుతం ఈ సమయంలో మీరు చేసే ఏ ప్రయత్నం ఫలించకపోవచ్చు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీ పెరుగుతున్న ఖర్చుల ఫలితంగా పొదుపులు మీకు మరింత సవాలుగా మారతాయి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి ఏడు, పదో గృహాలకు బుధుడు అధిపతి. ఈ రాశి ఏడో ఇంట్లో ఉంటాడు. ఈ సమయంలో ఉద్యోగం చేసే వ్యక్తులు పనిలో అధిక ఒత్తిడికి గురవుతారు. వ్యాపార యజమానులు తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ప్రయాణంలో డబ్బును పోగొట్టుకునే అవకాశం ఉంది. ఇది మీ నిర్లక్ష్యం వల్ల సంభవిస్తుంది.

మీన రాశి

మీన రాశి నాలుగు, ఏడో గృహాలకు బుధుడు అధిపతిగా వ్యవహరిస్తున్నాడు. ఈసారి నాలుగో ఇంట్లో ఉదయిస్తాడు. ఈ కాలంలో మీకు కంఫర్ట్ లెవెల్ తక్కువగా ఉంటుంది. ఇది మీ ఆనందాన్ని తగ్గిస్తుంది. మీరు సంపాదించిన దానికి కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అలాగే డబ్బు ఆదా చేయడం మీకు కష్టంగా ఉంటుంది.

బుధుడిని బలపరిచే మార్గాలు

జాతకంలో బుధుడి స్థానాన్ని బలపరిచేందుకు ప్రతికూల ప్రభావాలను నివారించేందుకు జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు పాటించడం మంచిది. వీటివల్ల బుధుడు శాంతించి సానుకూల ప్రయోజనాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.

బుధుడి అనుగ్రహం కోసం బుధ మంత్రాన్ని పఠించడం ఉత్తమం. అలాగే బుధుడిని శాంతింప చేసేందుకు మీరు ఇంట్లో చిలుకను పెంచుకోవచ్చు. భోజనానికి ముందు రోజుకు ఒకసారి ఆవుకు మేత తినిపించాలి. పాలకూర వంటి ఆకుపచ్చ ఆకుకూరలు, కూరగాయలు తినిపించడం వల్ల బుధ అనుగ్రహం పొందుతారు.

జాతకంలో బుధుడి స్థానం బలహీనంగా ఉన్నవాళ్లు తమ సోదరీమణులు, ఇంట్లో ఆడవారి పట్ల గౌరవంగా ప్రవర్తించాలి. అలాగే నోటి శుభ్రతను పాటించడం వల్ల బుధుడి చెడు ప్రభావం తగ్గుతుంది.

మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇది బుధుడికి బలాన్ని ఇస్తుంది. ప్రతిరోజు వెండి గ్లాసులో నీటిని తాగటం చేయండి. ఇలా చేయడం వల్ల అననుకూల ప్రభావాలు తగ్గే అవకాశం ఉంది. నంపుసకుల ఆశీస్సులు పొందాలి. తెల్ల దారానికి వెండి లేదా రాగినానం ధరించడం ఉత్తమం.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

WhatsApp channel