బుధుడు తిరోగమనంతో.. ఈ 3 రాశుల వాళ్లకు తిరుగే లేదు.. మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి
బుధుడు సంచారం 12 రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తోందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ప్రస్తుతం బుధుడు వృశ్చికం గుండా సంచరిస్తున్నారు. నవంబర్ 26న వక్ర స్థితిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. డిసెంబర్ 16న బుధుడు తిరుగమనంలో ఉంటాడు. కొన్ని రాశులు బుధుడు తిరోగమనం వలన ముందుకు వెళ్ళబోతున్నాయి.
బుధ గ్రహం ప్రభావితులు పొట్టిగా ఉంటారు. అలాగే వారు చురుకుగా ఉంటారు. చాలామంది రచయితలు, కళాకారులు అవుతారు. బుధ గ్రహం ప్రభావితులు తలనొప్పి, అల్సర్ వంటి సమస్యలకు పీడితులవుతారు. బుధుడు తిరోగమనం కొన్ని రాశులపై ప్రభావితం చూపిస్తోంది. మరి ఏ రాశులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
బుధుడు సంచారం 12 రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తోందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ప్రస్తుతం బుధుడు వృశ్చికం గుండా సంచరిస్తున్నారు. నవంబర్ 26న వక్ర స్థితిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. డిసెంబర్ 16న బుధుడు తిరుగమనంలో ఉంటాడు. కొన్ని రాశులు బుధుడు తిరోగమనం వలన ముందుకు వెళ్ళబోతున్నాయి. మరి ఏ ఏ రాశులు ఉన్నాయో చూద్దాం.
వృషభ రాశి:
వృషభ రాశి వారి ఏడవ ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉంటాడు. దీని వల్ల మీరు ఉద్యోగ, వ్యాపారాలలో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పని సంబంధిత అలవాట్లు మీకు మంచి లాభాలను ఇస్తాయి. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలున్నాయి. మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీరు విజయాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగుతారు. ఆస్తి సంబంధ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఇతరుల పట్ల గౌరవం పెంచుకోండి.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి మొదటి ఇంట్లో తిరోగమనంలో ఉంటారు. దీనివల్ల ఆస్తిలో మంచి ఫలితాలు పొందుతారు.చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారులు మీకు అనుకూలంగా పని చేస్తారు. పదోన్నతి, వేతన పెంపు లభిస్తుంది. సహోద్యోగులతో మంచి పురోగతి ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మిత్రుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. శత్రువుల వల్ల కలిగే సమస్యలన్నీ తగ్గుతాయి. అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తిచేస్తారు.
మకర రాశి:
మీ రాశిచక్రంలోని 11వ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు. దీని వల్ల మీకు విజయావకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీ పై అధికారులు మీకు పూర్తి సహకారం అందిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తగ్గుతాయి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆరోగ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది. మీ తల్లిదండ్రుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.