త్వరలో బుధుడి తిరోగమనం, ఈ మూడు రాశుల కష్టాలు మాయం.. ఉద్యోగావకాశాలు, వ్యాపారంలో లాభాలు, సంతోషంతో పాటు ఎన్నో!-mercury retrograde on july 18th and gives jobs profits happiness and many more to gemini leo virgo ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  త్వరలో బుధుడి తిరోగమనం, ఈ మూడు రాశుల కష్టాలు మాయం.. ఉద్యోగావకాశాలు, వ్యాపారంలో లాభాలు, సంతోషంతో పాటు ఎన్నో!

త్వరలో బుధుడి తిరోగమనం, ఈ మూడు రాశుల కష్టాలు మాయం.. ఉద్యోగావకాశాలు, వ్యాపారంలో లాభాలు, సంతోషంతో పాటు ఎన్నో!

Peddinti Sravya HT Telugu

జూలై 18న బుధుడు తిరోగమనం చెందుతాడు. బుధుడు తెలివితేటలు, తర్కం, కమ్యూనికేషన్, గణితం, తెలివితేటలు, స్నేహానికి కారకుడు. జ్యోతిషశాస్త్రంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. బుధుడి తిరోగమనం వల్ల ఏయే రాశుల వారికి మేలు జరుగుతుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు వంటి విషయాలను తెలుసుకుందాం.

త్వరలో బుధుడు తిరోగమనం, ఈ మూడు రాశుల కష్టాలు మాయం

2025 జూలై 18న బుధుడు తిరోగమనంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు తెలివితేటలు, తర్కం, కమ్యూనికేషన్, గణితం, తెలివితేటలు, స్నేహం వంటి వాటికి కారకుడు. జ్యోతిష శాస్త్రంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. బుధుడిని యువరాజు అంటారు. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతూ ఉంటాయి.

అలాగే బుధుడు కూడా ఎప్పటికప్పుడు రాశిని మారుస్తూ ఉంటాడు. జూలై నెలలో సింహ రాశిలో బుధుడి తిరోగమనం చెందుతాడు. ఈ సమయంలో బుధుడు కొన్ని రాశులకు మంచి సమయాన్ని ఇస్తాడు. మరి బుధుడి తిరోగమనం వల్ల ఏయే రాశుల వారికి మేలు జరుగుతుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు వంటి విషయాలను తెలుసుకుందాం.

బుధుడి తిరోగమనంతో ఈ మూడు రాశులకు బోలెడు లాభాలు

1.మిథున రాశి

మిథున రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కాబట్టి అవకాశాలను వదులుకోకుండా జీవితంలో పురోభివృద్ధి పథంలో ముందుకు సాగండి. వ్యాపారులకు ఆశించిన లాభాలు లభిస్తాయి. అయితే, ఈ సమయంలో పనిభారం పెరగడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి మీకు అవసరమైనప్పుడు విరామం తీసుకోవడానికి ఆలోచించకండి.

2.సింహ రాశి

సింహ రాశి జాతకులకు తిరోగమన బుధుడు సంతోషాన్ని కలిగిస్తాడు. సౌకర్యాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. విద్యారంగంతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం శుభదాయకమని చెప్పవచ్చు.

3.కన్య రాశి

కన్యా రాశి వారికి బుధుడు శుభదాయకంగా ఉంటాడు. మీ పని తీరు మెరుగుపడుతుంది. గౌరవం, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూలమైన సమయం. మీ శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.