Mercury retrograde: బుధుడి తిరోగమనం.. వీరికి కోర్టు కేసుల్లో ఎదురుదెబ్బలు, పనుల్లో అంతరాయాలు-mercury retrograde in leo three zodiac signs faces court issuses ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Retrograde: బుధుడి తిరోగమనం.. వీరికి కోర్టు కేసుల్లో ఎదురుదెబ్బలు, పనుల్లో అంతరాయాలు

Mercury retrograde: బుధుడి తిరోగమనం.. వీరికి కోర్టు కేసుల్లో ఎదురుదెబ్బలు, పనుల్లో అంతరాయాలు

Gunti Soundarya HT Telugu
Jul 09, 2024 03:59 PM IST

Mercury retrograde: జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం ఆగస్టు 5, 2024న గ్రహాల రాకుమారుడైన బుధుడు సింహ రాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి కష్టాలు పెరగవచ్చు. కోర్టు కేసుల్లో ఎదురుదెబ్బలు తగులుతాయి.

బుధుడి తిరోగమనం
బుధుడి తిరోగమనం

Mercury retrograde: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంచారంతో పాటు తిరోగమన కదలిక ప్రజల మనస్సుపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాల రాకుమారుడైన బుధుడు ఆగస్టు నెలలో తిరోగమన దశలో కదలబోతున్నాడు. ఇది మేషం నుండి మీనం వరకు 12 రాశులపై శుభ లేదా అశుభ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

yearly horoscope entry point

ప్రస్తుతం బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. జులై 19న బుధుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. దృక్ పంచాంగ్ ప్రకారం ఆగష్టు 5, 2024న బుధుడు సింహ రాశిలో తిరోగమనంలో ఉంటాడు. ఆగస్టు 24, 2024 తెల్లవారుజామున 2:43 వరకు తిరోగమన స్థితిలో ఉంటాడు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం కొన్ని రాశుల వారికి బుధుడు తిరోగమనం చేయడం వల్ల విపరీతమైన ప్రయోజనాలు లభిస్తాయి. కానీ మారికొంతమందికి మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ 19 రోజులు కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. బుధుడి తిరోగమన కదలిక ఏ రాశిచక్రాలకు ఇబ్బందికరంగా ఉంటుందో తెలుసుకుందాం.

సింహ రాశి

సింహ రాశిలోనే బుధుడి తిరోగమన సంచారం జరగబోతుంది. ఫలితంగా ఈ రాశి వ్యక్తులు బుధుడు తిరోగమన సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కోపం తగ్గించుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. ఈ రోజుల్లో మీరు కుటుంబ జీవితంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇంట్లో ఘర్షణతో కూడిన వాతావరణ పరిస్థితి ఉండవచ్చు. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మాటలు అదుపులో ఉంచుకోవాలి. కోర్టు కేసుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు.

వృశ్చిక రాశి

బుధుడి తిరోగమనం వృశ్చికరాశి వారికి మానసిక క్షోభను కలిగిస్తుంది. ఈ సమయంలో ప్రశాంతమైన మనస్సుతో నిర్ణయాలు తీసుకోండి. సంబంధాలలో సహనం పాటించండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మీ జీవిత భాగస్వామితో సైద్ధాంతిక విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ కాలంలో ఆరోగ్యం విషయంలో ఆందోళనలు ఉంటాయి. కెరీర్‌లో అడ్డంకులు ఎదురుకావచ్చు. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. వారి వల్ల సమస్యలు పెరుగుతాయి.

మకర రాశి

బుధగ్రహం తిరోగమనం కారణంగా మకర రాశి వారు జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో మీ ఏకాగ్రత లోపిస్తుంది. పనిలో ఆటంకాలు ఉండవచ్చు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు ఉంటాయి. తెలియని భయం వల్ల మనసు చికాకుగా ఉంటుంది. నెగెటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. పని నిమిత్తం చాలా దూరం ప్రయాణించాల్సి రావచ్చు. ఈ సమయంలో పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోండి. డబ్బు విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకండి. లేకుంటే నష్టం జరగవచ్చు. ఆస్తి విషయంలో బంధువులు లేదా స్నేహితులతో వివాదాలు ఉండవచ్చు.

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

Whats_app_banner