Mercury retrograde: బుధుడి తిరోగమనం.. 47 రోజుల తర్వాత ఈ రాశుల వారికి అదృష్టం కలగబోతుంది
Mercury retrograde: బుధుడు ఆగస్ట్ నెలలో తిరోగమన దశలో సంచరించబోతున్నాడు. దీని ప్రభావంతో మూడు రాశుల వారికి అదృష్టం కలగబోతుంది. అవి ఏ రాశులో చూద్దాం.
Mercury retrograde: గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలు, తర్కం, వాక్కు మొదలైన వాటికి కారకుడిగా ఉంటాడు. సూర్యుడికి దగ్గరగా ఉంటూ నవ గ్రహాలలో అత్యంత వేగంగా రాశి చక్రాన్ని మార్చుకోగల గ్రహం బుధుడు. ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నాడు. జూన్ నెలలో రెండు సార్లు తన కదలిక మార్చుకుంటాడు.

జూన్ 14న మిథున రాశి ప్రవేశం చేసిన బుధుడు జూన్ 29వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం ప్రత్యక్ష మార్గంలో సంచరిస్తున్న బుధుడు మరికొద్ది రోజుల్లో తిరోగమన దశలో తన ప్రయాణం ప్రారంభిస్తాడు. ఆగస్టు నెలలో బుధుడు ప్రత్యక్షం నుంచి తిరోగమనం చేయబోతున్నాడు. ఏడాదికి మూడు సార్లు బుధుడు తిరోగమన దశలోకి వెళతాడు.
ఆగస్ట్ 5వ తేదీ బుధుడు సింహ రాశి ప్రవేశం చేస్తాడు. ఈ రాశిలోనే తిరోగమన దశలోకి వెళ్ళి కన్య రాశిలోకి వక్రమార్గంలోనే ప్రవేశిస్తుంది. ఆగస్ట్ 28వ తేదీ వరకు బుధుడు తిరోగమనంలోనే సంచరిస్తాడు. దీని వల్ల సింహ, కన్య రాశులు ప్రభావితం అవుతాయి. ఈ సంచారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు కలిగిస్తుంది.
బుధుడి తిరోగమన ప్రతికూల ప్రభావాలు
బుధుడి తిరోగమన దశ కాలం చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో సంబంధాల్లో క్షీణత ఏర్పడుతుంది. ప్రేమ, వైవాహిక జీవితంలో తరచూ విభేదాలు వస్తాయి. స్నేహితుల మధ్య పొరపొచ్చాలు ఏర్పడే అవకాశం ఉంది. ఒత్తిడి, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి జీవితంలో అదృష్టం కలిసి రాకపోవచ్చు. పనులు నిలిచిపోవడం, ఉన్నతాధికారులతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి.
బుధుడి తిరోగమన అనుకూల ప్రభావాలు
బుధుడు మనసు, మాట ఆలోచనలతో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో ఆదాయం, ఆర్థిక విషయాలకు సంబంధించి చాలా మార్పులు జరుగుతాయి. ప్రేమ సంబంధాల్లో మార్పులు తీసుకొస్తాడు. సుమారు 47 రోజుల తర్వాత ఏ రాశుల వారికి బుధుడు అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాడో తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
బుధుడి తిరోగమనం నుంచి ధనుస్సు రాశి వారు భారీ ప్రయోజనాలు పొందుతారు. ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో మీరు ఊహించని ప్రదేశాల నుండి డబ్బు వస్తుంది. ప్రేమ జీవితంలో రొమాన్స్ ఉంటుంది. కెరీర్ పరిస్థితి కూడా బాగుంటుంది.
సింహ రాశి
సింహ రాశిలోనే బుధుడి తిరోగమనం జరగబోతుంది. ఫలితంగా ఈ రాశి వారికి బుధుడి తిరోగమనం పూర్తి అదృష్టాన్ని ఇవ్వబోతుంది. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్త ఉద్యోగ ఆఫర్లను కూడా పొందవచ్చు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా నిలకడగా ఉంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి బుధుడి తిరోగమన సంచారం శుభప్రదంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకుంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.