గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో కొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు మాత్రం లాభాలు పొందుతారు. జ్యోతీష శాస్త్రం ప్రకారం సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువు తప్ప మిగిలిన గ్రహాలు గురువు, శుక్రుడు, బుధుడు, కుజుడు, శని వంటి ఇతర గ్రహాలు రాశులను మార్పు చెందడంతో పాటుగా సూర్యుని చుట్టూ తిరుగుతాయి.
ఈ గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగి వృత్తాకార మార్గాన్ని "ఎక్లిప్టిక్" అని అంటారు. ఈ మార్గంలో బుధుడు తన దిశను జూలై 4న మార్చుకుంటాడు. దృక్ పంచాంగం ప్రకారం బుధుడు శుక్రవారం ఉదయం 9:03 గంటలకు ఉత్తరం నుంచి దక్షిణంలోకి తిరుగుతాడు. దక్షిణానికి వెళ్లడం వలన కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది కూడా.
బుధుడు మేదస్సు, ప్రసంగం, సంభాషణ, కమ్యూనికేషన్‌కు కారకుడు. బుధుడు దక్షిణ మార్గంలో ఉన్నప్పుడు ఆత్మ పరిశీలనకు, పాత పనులను పూర్తి చేసుకోవడానికి ఇది మంచి సమయం. ఈ సమయంలో ప్రజలు చర్చలు, సంభాషణలు, వ్యాపార నిర్ణయాల్లో స్పష్టతను పొందుతారు. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ, ఐదు రాశుల వారికి మాత్రం ఇది శుభప్రధానంగా ఉంటుంది. మరి ఆ రాశుల్లో మీ రాశి ఉందేమో చూద్దాం.
వృషభ రాశి వారికి బుధుడు ఈ సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ రాశి వారు ప్రమోషన్లు పొందుతారు. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు కూడా ఉండొచ్చు. బిజినెస్ చేసే వారికి కొత్త క్లయింట్లు వస్తారు. బంధం కూడా దృఢంగా ఉంటుంది.
కర్కాటక రాశి వారికి టెన్షన్లు తొలగిపోతాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పని ప్రదేశంలో సక్సెస్‌ను అందుకుంటారు. ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో కూడా సక్సెస్ ఉంటుంది. బుధుడి మార్పు వలన పాత ఇన్వెస్ట్మెంట్ల వలన ఎక్కువ లాభం వస్తుంది. కొత్త పనులన్నీ ప్రారంభించడానికి ఇది మంచి సమయం.
వృశ్చిక రాశి వారికి ఆర్థికపరంగా ఇది కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో మీ దగ్గరికి రాని ధనం ఈ సమయంలో వస్తుంది. ఒత్తిడి తొలగిపోతుంది. సంతోషంగా ఉంటారు.
మకర రాశి వారు కొత్త బాధ్యతలను చేపడతారు. కొత్త ప్రాజెక్టులను మొదలుపెడతారు. టెక్నికల్ లేదా కమ్యూనికేషన్ ఫీల్డ్‌లో ఉన్న వారికి ఈ సమయం బాగుంటుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు.
కన్య రాశి వారికి ఇది మంచి సమయం. చాలా కాలంగా ఆగిపోయిన కెరీర్ మళ్ళీ ప్రారంభం అవుతుంది. పెట్టుబడులతో లాభాలను వస్తాయి. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.